నిజామాబాద్: నల్గొండ బాటలోనే నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి నిలిచారు.నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి 236 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ స్థానంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఈ స్థానానికి షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయా.. తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

పసుపు, ఎర్రజొన్న రైతులు కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లను పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు సంఘాలు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ నిర్ణయం మేరకు 236 మంది రైతులు ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ల దాఖలు చేసేందుకు చివరి రోజు సోమవారం చివరి రోజు కావడంతో టోకెన్లు తీసుకొని  మరీ రైతులు నామినేషన్లను దాఖలు చేశారు.  సోమవారం నాడే 179 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్చి 20వ తేదీన 7, మార్చి 22వ తేదీన 56 నామినేషన్లు దాఖలయ్యాయి. 

పసుపు, ఎర్ర జొన్న రైతులు తమ డిమాండ్లను నెరవేర్చుకొనేందుకు పోటీ చేస్తామని ప్రకటించాయి.అయితే నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు తమను వేధింపులకు గురి చేశారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

నిర్భంధాలను లెక్క చేయకుండానే రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. 96  కంటే ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి.

నిజామాబాద్ ఎంపీ స్థానానికి 242 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికల నిర్వహణకు సమయం సరిపోతోందా... నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయా... లేక ఎన్నికలను వాయిదా వేసి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయమై ఎన్నికల అధికారుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత బరిలో ఉన్నారు 2004,2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి మధు యాష్కీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కవిత టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. ఈ దఫా ఆమె మరోసారి ఇదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

1996 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ  జలసాధన సమితి నేతలు 537 నామినేషన్లు దాఖలు చేశారు. 

అయితే కొందరి నామినేషన్లను తిరస్కరించారు. చివరికి 480 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మబిక్షం విజయం సాధించారు.ఆ ఎన్నికల తర్వాతే  నామినేషన్ ఫీజును భారీగా పెంచారు. 

సంబంధిత వార్తలు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)