నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవితపై  సుమారు 1000 మంది రైతులు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.

ఎర్రజొన్న, పసుపు  రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు.

ఎర్రజొన్న, పసుపు రైతులు కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ నిరసనను కేంద్ర, రాష్ట్ర పాలకుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో కవిత టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

మరోసారి ఆమె ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. ఈ స్థానంలో  అన్నదాతలు పోటీకి సిద్దమయ్యారు. సుమారు వెయ్యి మంది రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే అన్నదాతల డిమాండ్ల విషయమై  పాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)