ఆమేథీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కంటే  బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. తన ఓటమిని రాహుల్ గాంధీ ఒప్పుకొన్నారు. 

యూపీ రాష్ట్రంలోని ఆమేథీలో 1998 మినహా పలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుసగా మూడు దఫాలు విజయం సాధించారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా  రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి పోటీ చేశారు.

ఆమేథీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడుగా ఉన్న స్థానిక కాంగ్రెస్ నేత ఈ దఫా ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్దమయ్యారు. ఈ నేత సోనియాతో పాటు రాజీవ్ గాంధీ నామినేషన్లకు ప్రతిపాదకుడుగా ఉన్నారు.

స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదనే కారణంగా  ఆ ముస్లిం నేత పోటీలో ఉన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుండి  రాహుల్ పోటీ చేశారు.

ఆమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపు బాటలో పయనిస్తున్నారు. మీడియా సమావేశంలో ఆమేథీలో రాహుల్ తన ఓటమిని ఒప్పుకొన్నారు. వయనాడ్ ఎంపీ స్థానం నుండి  రాహుల్ విజయం సాధించారు.