నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి  బ్యాలెట్ పేపర్‌నే వినియోగించాలని పసుపు, ఎర్రజొన్న రైతులు డిమాండ్ చేశారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్నారు. 

సోమవారం నాడు జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌లో పోటీలో ఉన్న రైతులు సమావేశమయ్యారు. రాజకీయ పార్టీలకు కాకుండా తమకు ఓటు చేయాలని రైతుల కోరారు. దీర్ఘకాలికంగా తమ సమస్యలను పరిష్కరించేందుకు గాను తమను ఎన్నుకోవాలని  రైతులు కోరారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  185 మంది రైతులు  పోటీలో ఉన్నారు. ఈ పార్లమెంట్ స్థానానికి  ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినందున బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. 

ఈసీ అధికారులు కూడ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా కూడ ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకొంది. ఈసీ నిర్ణయంపై  పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)