వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి సీటుకు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన తెలంగాణ రైతులకు చుక్కెదురైంది. నామినేషన్లు వేయకుండా వారిని బిజెపి కార్యకర్తలు శనివారం అడ్డుకున్నారు. నామినీలను బిజెపి కార్యకర్తలు బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

తమ సమస్యలను పరిష్కరించాలనే తమ డిమాండుకు మద్దతును కూడగట్టుకోవడానికి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసికి పెద్ద యెత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా తెలంగాణ నుంచి వారణాసికి రైతులు తరలి వచ్చారు. అయితే, వారికి ఇక్కడ నామినేషన్లు వేయడానికి అనూహ్యమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారణాసి సీటుకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇక కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా వారు ఏమైనా నామినేషన్లు దాఖలు చేయగలుగుతారా లేదా అనేది వేచి చూడాల్సింది.

నిజామాబాద్ పార్లమెంటు సీటుకు కూడా రైతులు పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ లోకసభ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఆ తదుపరి వారు వారణాసిలో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)