వారణాసి ఎంపీ స్థానం నుండి  సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్మీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్  చెల్లదని ఈసీ ప్రకటించింది. 

వారణాసి: వారణాసి ఎంపీ స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ ఆర్మీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది.

సరైన పత్రాలు జతపర్చనందుకు గాను తేజ్ బహదూర్ నామినేషన్‌ను తిరస్కరించినట్టుగా వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సురేంద్ర సింగ్ ప్రకటించారు.

బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ ఎస్పీ అభ్యర్ధిగా వారణాసి నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు సూచించినట్టుగానే తాను మంగళవారం సాయత్రం 6.15 గంటలకు పత్రాలను సమర్పించినట్టుగా ఆయన వివరించారు.కానీ తన నామినేషన్‌ను తప్పుడు కారణాలతో రద్దు చేశారని ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు.