లక్నో: రాంపూర్ లో తన ఓటమిపై ప్రముఖ సినీ నటి, బిజెపి అభ్యర్థి జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి గల కారణాలను ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. సొంత పార్టీ నేతల వల్లే తాను ఓడిపోయానని నిందించారు. 

సొంత పార్టీ నేతలు  ప్రత్యర్థితో చేతులు కలిపి తనను ఓడించారని జయప్రద ఆరోపించారు. తన ఓటమికి కారణమైన పార్టీ నేతల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

సమాజ్‌వాది అభ్యర్థి అజంఖాన్ చేతిలో లక్షకుపైగా ఓట్ల తేడాతో జయప్రద పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.