Asianet News TeluguAsianet News Telugu

కలయిక నొప్పిగా ఉండకూడదంటే.. ఇలా చేయాలి

శారీరక సమస్యలు చెప్పాలంటే చాలామంది స్త్రీలు తమకు యోని ముఖద్వారం చాలా చిన్నగా ఉండటం వల్లే ఆ సమయంలో నొప్పి వస్తోందని అనుకుంటారు. కానీ దాదాపు తొంభై శాతం మంది స్త్రీలల్లో అలాంటిదేమీ ఉండదు. 

how to getrid of the pain from first time sex
Author
Hyderabad, First Published Sep 3, 2018, 2:38 PM IST

పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిలు కంగారుపడిపోతుంటారు. పెళ్లి కంటే ముందు.. ఆ తర్వాత జరిగే తొలిరాత్రి గురించే వారి భయమంతా. తొలి కలయిక.. అంటే నొప్పి కలిగిస్తుందనేది వారి నమ్మకం. అసలు ఈ నమ్మకాన్ని తొలగించుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.. మరి అవేంటో చూసేద్దామా...

దాదాపు ఎనభైశాతం మంది స్త్రీలు లైంగికచర్యను ఆనందించలేకపోవడానికి ప్రధాన కారణం నొప్పి తద్వారా వచ్చే బాధ. శారీరక సమస్యల కన్నా, మానసిక భయాలే దీనికి ప్రధాన కారణం. శారీరక సమస్యలు చెప్పాలంటే చాలామంది స్త్రీలు తమకు యోని ముఖద్వారం చాలా చిన్నగా ఉండటం వల్లే ఆ సమయంలో నొప్పి వస్తోందని అనుకుంటారు. కానీ దాదాపు తొంభై శాతం మంది స్త్రీలల్లో అలాంటిదేమీ ఉండదు. 

ఒకవేళ లైంగికచర్య జరిపినప్పుడల్లా కొన్ని నెలల పాటు విపరీతమైన నొప్పి బాధిస్తోంటే అప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యులు పరీక్షలు చేసి అనుకున్నట్లుగానే ఆ మార్గం చిన్నగా ఉందంటే ఫెంటన్స్‌ అనే శస్త్రచికిత్స చేసి ఆ మార్గాన్ని కాస్త పెద్దగా చేస్తారు. శృంగార సమయంలో నొప్పి (డిస్పెరూనియా) సమస్య దాదాపు 20 నుంచి 50 శాతం మహిళల్లో ఉంటుంది.

 చాలామంది మహిళలు ఎంత బాధ ఉన్నా సరే... మొహమాటంతో ఈ సమస్యను వైద్యులతో చర్చించడానికి సందేహిస్తారు. దీనికి మానసికంగా ఉన్న భయం ఒక కారణమైతే, ఎండోమెట్రియోసిస్‌ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, యోనిమార్గం పొడిబారడం వంటివీ మరికొన్ని. ఈ సమస్యలకు చికిత్స ఉంది. నొప్పి దీర్ఘకాలికంగా బాధిస్తోంటే తేలిగ్గా తీసుకోకుండా వైద్యుల్ని సంప్రదించడమే మంచిది. హార్మోన్ల పరీక్షలు చేసి, సమస్యను బట్టి చికిత్సను సూచిస్తారు. ఎండోమెట్రియోసిస్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు లాంటివయితే చికిత్స ఉంటుంది. యోనిమార్గం పొడిబారితే ల్యూబ్రికెంట్లు వాడితే చాలు.

పెళ్లయిన మొదటిసారి కలయికను పూర్తిస్థాయిలో ఆనందించలేపోవడం దాదాపు తొంభైశాతం జంటల్లో కనిపించేదే. దాంతో ప్రతిసారి అలాగే అవుతుందనుకుంటారు. కానీ కాదు. దీనికి సరైన పరిష్కారం ఇద్దరిమధ్యా ఉండాల్సిన అవగాహన. ఇతర విషయాలు చర్చించుకున్నట్లుగానే మీరూ, మీ భాగస్వామి కలయిక సమయంలో ఎదురవుతోన్న సమస్యల గురించి మాట్లాడుకోవాలి. భయాల్ని పంచుకోవాలి. చాలావరకూ మార్పు వస్తుంది. 

మరికొన్ని జంటలు చెప్పే సమస్య లైంగిక జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందించలేకపోతున్నాని. ముఖ్యంగా భావప్రాప్తి (ఆర్గాస్మ్‌) పొందలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి 75 శాతం మందిలో ఇలాంటి భావన సాధ్యం కావడంలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కలయిక పట్ల భయం పోయేకొద్దీ, రకరకాల భంగిమలు ప్రయత్నించడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు భావప్రాప్తిని (ఆర్గాస్మ్‌) పూర్తిస్థాయిలో పొందే అవకాశముంది. ఈ విషయంలో అపోహల్ని దూరం చేసుకోవడానికి సెక్స్‌ థెరపిస్ట్‌ని సంప్రదించొచ్చు.

 

సంబంధిత వార్తలు

30శాతం మహిళలు భర్తలను మోసం చేస్తున్నారా..? కేవలం 4శాతం..

రోజులో 7గంటలపాటు సెక్స్.. అయినా తృప్తి లేదట

Follow Us:
Download App:
  • android
  • ios