Asianet News TeluguAsianet News Telugu

పెదవులపై ఐస్ పెడితే ఏమవుతుందో తెలుసా?

ఐస్ క్యూబ్స్ ను ఎక్కువగా ముఖానికే రుద్దుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ మీరు పెదవులపై ఐస్ ను పెట్టినా బోలెడు లాభాలను పొందుతారు. అవేంటంటే? 

benefits of applying ice on lips rsl
Author
First Published Oct 3, 2024, 11:49 AM IST | Last Updated Oct 3, 2024, 11:49 AM IST

ఐస్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి వాపును, నొప్పిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ సంగతి అందరికీ తెలిసింది. ఒకపోతే చాలా మంది ఆడవారు దీన్ని అందం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అంటే ముఖానికి ఐస్ ను రుద్దుతుంటారు. దీనివల్ల ఫేస్ గ్లో పెరుగుతుంది. అంతేకాదు చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే మీరు ముఖానికే కాకుండా.. దీన్ని పెదవులకు కూడా పెట్టొచ్చు. అవును పెదవులపై ఐస్ ను పెడితే మీరు ఆశ్యర్యపోయే ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పెదాలకు ఐస్ క్యూబ్ ప్రయోజనాలు

benefits of applying ice on lips rsl


పెదవులను హైడ్రేట్ చేస్తుంది

చాలా మంది పెదాలు డీహైడ్రేషన్ లో ఎండిపోతుంటాయి. అలాగే కొన్ని కొన్ని పగుళ్లు వచ్చి వాటిని నుంచి రక్తం కూడా వస్తుంటుంది. ఇలాంటి వారికి ఐస్ క్యూబ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పెదవులకు ఐస్ క్యూబ్స్ ను రుద్దితే మీ పెదాలు తిరిగి హైడ్రేట్ అవుతాయి. ఇందుకోసం ఒక ఐస్ క్యూబ్ ను తీసుకొని మీ పెదవులపై రుద్దండి. ఇది మీ పెదాలను హైడ్రేట్ గా చేస్తుంది. దీంతో మీ పెదాలు ఎండిపోయి పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. 

నల్లని పెదాలు ఎర్రగా అవుతాయి

ఐస్ క్యూబ్స్ ను ఉపయోగిస్తే పెదాలు సహజంగా శుభ్రపడతాయి. అంతేకాదు నల్లగా ఉన్న పెదాలు కూడా ఎర్రగా అవుతాయి. పెదవులకు ఐస్ క్యూబ్స్ ను వాడటం వల్ల మీ పెదవుల చుట్టు ఉన్న నల్లని చర్మ తొలగిపోతుంది. దీంతో పెదాలు ఎర్రగా అందంగా అవుతాయి. 

వాపును తగ్గిస్తుంది

చాలా మంది పెదవులు కూడా వాపు వస్తుంటాయి. అయితే ఐస్ క్యూబ్స్ పెదవుల వాపును తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. ఐస్ క్యూబ్స్ ను పెదవులకు పెట్టడం వల్ల రక్త నాళాల సంకోచిస్తాయి. అలాగే  పెదవులు, దాని చుట్టూ ఉన్న వాపును తగ్గించడంలో ఐస్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

సూర్యరశ్మి నుంచి రక్షణ

ఎక్కువ సేపు ఎండలో ఉంటే ముఖం నల్లగా మారడమే కాకుండా.. చర్మం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు ఇది స్కిన్ చికాకును కలిగించడమే కాకుండా.. పెదువుల్లో కూడా  చిరాకును పెంచుతుంది. పెదవులు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మీరు పెదవులకు ఐస్ క్యూబ్స్ ను రుద్దండి. సమస్య వెంటనే తగ్గిపోతుంది. 

గులాబీ పెదవులు

చాలా మంది అమ్మాయిలకు తమ పెదవులు గులాబీ రంగులో ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకే పింగ్ కలర్ లిప్ స్టిక్ ను వాడుతుంటారు. కానీ కొన్ని పద్దతుల్లో మీరు నేచురల్ గా మీ పెదవులను గులాబీ రంగులో ఉండేలా చేయొచ్చు. దీంతో మీరు లిప్ స్టిక్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు మీపెదవులను సహజంగా పింక్ కలర్ లోకి మార్చాలనుకుంటే పెదవులపై ఐస్ ముక్కను రుద్దండి. ఇది పెదాలపై డెడ్ స్కిన్ ను తొలగించి గులాబీ రంగులోకి మారుస్తుంది. 

మెరుగైన రక్త ప్రసరణ

ఐస్ క్యూబ్స్ ను ముఖానికి రుద్దితే చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఐస్ క్యూబ్ ను పెదవులపై రుద్దితే కూడా మీ పెదవుల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మీ పెదవులు పిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

పెదవులకు ఐస్ ను ఎలా అప్లై చేయాలి?

ఐస్ క్యూబ్స్ వల్ల మీరు ప్రయోజనాలను పొందతాలనుకుంటే ప్రతిరోజూ సాయంత్రం వేళ 3 నుంచి 5 నిమిషాల పాటు పెదవులపై ఐస్ క్యూబ్స్ ను రుద్దండి. వీటితో పాటుగా ఫ్రూట్ జ్యూస్, హెర్బల్ టీ, అలోవెరా జెల్ ను కూడా కూడా మీరు పెదవులకు ఉపయోగించొచ్చు.

benefits of applying ice on lips rsl

ముఖానికి ఐస్ క్యూబ్స్ ను రుద్దడం వల్ల కలిగే ప్రయోజనాలు

అందంగా చేస్తుంది: ఐస్ క్యూబ్స్ ను ముఖానికి రుద్దడ వల్ల మంట తగ్గుతుంది. అలాగే మీ ముఖంలో అలసట మటుమాయం అవుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మీ స్కిన్ టోన్ ను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో మీ ఫేస్ లో వెంటనే గ్లో వస్తుంది. 

మొటిమలను తగ్గిస్తుంది: మొటిమలు తగ్గడానికి కూడా ఐస్ క్యూబ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇది మీ మొటిమలపై ఐస్ ను పెడితే రక్త ప్రవాహం మెరుగుపడి రంధ్రాలను కుదించబడతాయి. దీంతూ ముఖంపై నూనె ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల ముఖంపై ఎరుపు, మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కళ్ల చుట్టూ ఉబ్బును తగ్గిస్తుంది: కొంతమంది కళ్లు ఉదయం లేవగానే బాగా ఉబ్బిపోతుంటాయి. అయితే ఇలాంటి వారు ముఖానికి  క్రమం తప్పకుండా ఐస్ ను అప్లై చేయడం వల్ల విస్తరించిన రక్త నాళాలు కుదించబడతాయి. దీంతో మీ ముఖంలో వాపు తగ్గుతుంది. ఇది ఉబ్బిన కళ్లను నార్మల్ చేయడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది: ఐస్ ముఖానికి చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే ఇది మీ చర్మ రంధ్రాలను బిగించడానికి సహాయపడుతుంది. అలాగే ముఖంపై ఉన్న ముడతలను, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఐస్ వల్ల మీ చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios