గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ నంబర్ గురించి తెలుసుకోకపోతే చాలా డేంజర్
మీరు ప్రతి నెలా గ్యాస్ బుక్ చేస్తారు కదా! అయితే సిలిండర్ పై ఉన్న ఈ నంబర్ ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. దీని గురించి తెలుసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ నంబర్ ఏంటి? సిలిండర్ పై ఎక్కడ ఉంటుంది? దాని గురించి ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కట్టెల పొయ్యిలు పోయి, సిలిండర్లు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. గ్యాస్ వల్ల మనమంతా పొగ లేకుండా వంట చేసుకుంటూ హాయిగా జీవితం గడిపేస్తున్నాం. అయితే గ్యాస్ సిలిండర్ల గురించి పూర్తి విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ గ్యాస్ సిలిండర్ పై ఉండే వివిధ రకాల నంబర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సిలిండర్ పై ఈ మూడు అంకెల నంబర్ ఏంటి?
మీరు సరిగ్గా గమనిస్తే గ్యాస్ సిలిండర్ హ్యాండిల్స్ లో ఒకదానిపై మూడు అంకెలతో ఒక నంబర్ ఉంటుంది. A24, B27, C26, D24 ఇలా ఉంటాయి. వాటి అర్థం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ A అంటే జనవరి నుంచి మార్చి వరకు
B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు
C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు
D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
ఈ లెటర్స్ కు చివర ఉన్న నంబర్ సంవత్సరాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే 24 అంటే 2024 అని, 27 అంటే 2027 అని అర్థం. ఇంగ్లీష్ లెటర్స్, నంబర్స్ తో కలిసి ఉన్న ఈ మొత్తం నంబర్ సిలిండర్ ఎక్పైరీ డేట్ ను తెలియజేస్తుందన్న మాట. దీన్ని బట్టి మీరు తీసుకున్న సిలెండర్ ఎక్పైరీ అయ్యిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. A24 అంటే ఈ సిలిండర్ జనవరి 2024 నుంచి మార్చి 2024 మధ్యలో ఎక్పైరీ అవుతుందని అర్థం. పొరపాటున డెలివరీ బాయ్ మీకు ఈ ఎక్పైరీ అయిన సిలిండర్ ఇస్తే వెంటనే రిటర్న్ ఇచ్చేయండి. లేదంటే ఏ క్షణంలోనైనా పేలే ప్రమాదం ఉంటుంది.
LPG సిలిండర్ అంటే ఏమిటి?
LPG(Liquefied Petroleum Gas) సిలిండర్ అనేది వంట గ్యాస్. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది పెట్రోలియం ప్రోడక్ట్ లో ఒకటి. LPG సిలిండర్‌లు సాధారణంగా 14.2 కిలోల కెపాసిటీతో ఉంటాయి. మన ఇళ్లలో ఉపయోగించే సిలిండర్లు ఇవే.
గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఎలా?
HP Gas, Indane, Bharat Gas వంటి సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయడానికి వీలుగా ఉంచుతున్నాయి.
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు Indane ఆప్ లేదా IVRS(1800-2333-555) ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
HP వినియోగదారులు HP Gas ఆప్ లేదా IVRS (1906) ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Bharat Gas వినియోగదారులు Bharat Gas ఆప్ లేదా IVRS(1800-22-4344) ద్వారా సిలిండర్ బుక్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి కంపెనీ ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్ లేదా IVR సర్వీస్‌కి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
వాట్సాప్(WhatsApp)లో బుకింగ్ ఎలా?
కొంతమంది కంపెనీలు తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేసే సదుపాయం కూడా అందిస్తున్నాయి. మీరు వారి అధికారిక WhatsApp నంబర్‌కు BOOK అని మెసేజ్ పంపడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. పేటీఎం(Paytm), గూగుల్ పే(Google Pay), ఫోన్ పే
(PhonePe) లాంటి వాలెట్ల ద్వారా కూడా సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధరలు
2024 అక్టోబర్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.900 నుండి రూ.1100 మధ్య ఉంటుంది. మీరు గ్యాస్ సిలిండర్లలో సబ్సిడీ పొందాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్‌కు, బ్యాంక్ ఖాతాకు లింక్ చేయించాలి. PAHAL(Pratyaksh Hanstantrit Labh) పథకం కింద, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ స్కీములు
ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద మహిళా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్‌లు ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ 2024 దీపావళి నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి పథకంతో సహా కొన్ని గ్యాస్ సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌ను ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాల్లో మహిళలకు రూ.2,500 రూపాయలు, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత RTC బస్సు ప్రయాణం కూడా అందిస్తుంది. గృహ జ్యోతి పథకం ద్వారా వినియోగదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. దీంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది.