తొక్కే కదా అని పారేయకండి.. నిమ్మ తొక్కతో బోలెడు లాభాలున్నాయి

సాధారణంగా నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ దీని తొక్క గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ తొక్కతో ఎలాంటి ప్రయోజనం లేదని పారేస్తుంటారు. కానీ ఈ తొక్క కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదెలాగంటే? 

Health Benifits of Lemon Peel rsl


ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయలు ఖచ్చితంగా ఉంటాయి. నిమ్మకాయల్ని మనం ఎన్నో వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే చాలా మంది ఉదయం లేచిన వెంటనే పరిగడుపున నిమ్మరసం తాగుతుంటారు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడటమే కాకుండా.. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అలాగే దాహాన్ని కూడా తీర్చుతుంది. అందుకే పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ నిమ్మరసాన్ని తాగడాన్ని బాగా ఇష్టపడతాయి.

నిమ్మకాయ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు నిమ్మకాయలో పొటాషియం కూడా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉప్పు, కొద్దిగా నీరు కలిపి గార్గిల్ చేస్తే నోట్లో ఉండే హానికారక బ్యాక్టీరియా తొలగిపోతుంది. 

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ నిమ్మకాయల నుంచి రసం తీసుకుని దాని తొక్కలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటాం. కానీ ఈ తొక్క కూడా మనకు ప్రయోజకరంగా ఉంటుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు. అవును నిమ్మ తొక్కలో మనం లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Health Benifits of Lemon Peel rsl

నిమ్మతొక్కలోని పోషక విలువలు

మీరు చెప్తే నమ్మరు కానీ.. నిమ్మతొక్కలో నిమ్మరసంలో కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంటే నిమ్మతొక్కలో నిమ్మరసంలో కంటే విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. 

నిమ్మతొక్క ఆరోగ్యానికి చేసే మేలు 

కంటికి మంచిది: నిమ్మ తొక్క కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ తొక్కల్లో ఉండే విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. అలాగే ఈ తొక్కల్లో విటమిన్ కూడా ఉంటుంది. ఇది వృద్ధుల్లో కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. 

గాయాలను నయం చేస్తుంది: నిమ్మకాయ తొక్కకు బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టే సామర్థ్యం ఉంటుంది. ఇది మీ గాయాలు త్వరగా నయమయ్యేలా చేయడానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్లలో అల్సర్లను త్వరగా నయం చేసే సిట్రిక్ యాసిడ్స్ కూడా దీనిలో మెండుగా ఉంటుది. ఇందుకోసం నిమ్మతొక్కను పుండ్ల చోట రుద్దండి. 

చెడు శ్వాసను తొలగిస్తుంది: నిమ్మ తొక్కలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుది. ఇది చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అయితే ఈ నిమ్మతొక్కను మీ చంక కింద భాగంలో రుద్దితే  చెమట వాసన, దుర్వాసన రాదు. అలాగే నీటిలో నిమ్మతొక్కలను మరిగించి ఆ నీట్లో కాటన్ క్లాత్ లేదా కాటన్ ను ముంచి చంకపై అప్లై చేసినా దుర్వాసన రాదు.

Health Benifits of Lemon Peel rsl

మొటిమలను తగ్గిస్తుంది: నిమ్మ తొక్కలో క్రిమి కీటకాలను చంపే గుణాలు కూడా ఉంటాయి. ఇందుకోసం ఆ తొక్కను, పుదీనాను నీట్లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ వాటర్ ను ముఖానికి అప్లై చేయాలి. దీనివల్ల ముఖంపై మొటిమలు ఏర్పడవు. 

మలబద్ధకానికి మంచిది:  నిమ్మతొక్కలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంటే ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ తొక్క అల్సర్లను నయం చేస్తుంది. అలాగే వెయిట్ పెరగకుండా కాపాడుతుంది కూడా. 

చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది: నిమ్మతొక్కలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ తొక్కల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

ఎముకలను బలోపేతం చేస్తుంది: నిమ్మ తొక్కల్లో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే నిమ్మతొక్కలు కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంటే ఇది మనల్ని క్యాన్సర్, శరీర కణాలను ప్రభావితం చేసే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నిమ్మతొక్కలతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఇకపై డస్ట్ బిన్ లో వేయకండి. ఎంచక్కా ఉపయోగించండి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios