పోర్న్ వీడియోలు బానిసలుగా మారిన ఇద్దరు స్నేహితులు.. మూడేళ్ల పసికందు జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేశారు. వారి ప్లాన్ మొత్తాన్ని ఫేస్ బుక్ లో డిస్కస్ కూడా చేసుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెట్టారు. ఈ సంఘటన  అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఫ్లోరిడాకు చెందిన లాఫె బెస్ట్(37), బెంజమిన్ వ్రోస్టర్(39) అనే ఇద్దరు స్నేహితులకు కొన్ని సంవత్సరాలుగా పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. ముఖ్యంగా వీరు చిన్నపిల్లల పోర్న్ వీడియోలను చూసేవారు. కాగా..పోర్న్ వీడియోలలో చూపినట్లుగా వారు కూడా 3 ఏళ్ల పాపపై లైంగికదాడి చేయాలనుకున్నారు. అందుకోసం వారి అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న 3 ఏళ్ల పాపను ఎంచుకున్నారు. 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వారిద్దరూ ఆ పాపను ఎలా ట్రాప్ చేయాలో చర్చించుకున్నారు. పాప తల్లి కూడా ఫేస్‌బుక్‌లో వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉందన్న సంగతి వారు గుర్తించలేకపోయారు. విషయాన్ని గ్రహించిన పాప తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. పోర్న్ వీడియోల ప్రభావంతోనే వారు చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారని పోలీసులు తెలిపారు.