జపాన్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.3 నమోదు.!
Earthquake : భారీ భూకంపంతో జపాన్ మరోసారి వణికిపోయింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం.. 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భవనాలు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Earthquake : జపాన్ మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం..జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పశ్చిమ జపాన్‌లో ఈ భూకంపం సంభవించింది. దీంతో భవనాలు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. అయితే అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
USGS భూకంప కేంద్రాన్ని ఉవాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు (11 మైళ్ళు) దూరంలో ఉంచింది. ఇది దాదాపు 25 కిలోమీటర్ల లోతులో ఉంది. క్యుషు, షికోకు దీవులను వేరుచేసే ఛానల్‌లో భూకంపం ఏర్పడింది. బుధవారం రాత్రి నైరుతి జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప నష్టంపై అంచనా వేస్తున్నారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం భారీగా నష్టం జరగలేదని తెలుస్తుంది. దీనికి ముందు కూడా గత వారం జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు.