దుబాయ్ వరదలకు కారణం హిందూ దేవాలయమే.. అల్లాహ్ కోపాన్ని చూశారంటూ పాకిస్తాన్ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు
ఇండియాపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ కు చెందిన కొంత మంది. దుబయ్ వరదలకు హిందూదేవాలయమే కారణం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
రీసెంట్ గా దుబాయ్ ని వరదలు ముంచెత్తాయి. చరిత్రలో ఎన్నడు కనీవినీ ఏరుగని రీతిలో వరదలు వచ్చి.. చాలా నష్టం చేశాయి. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ విచారం వ్యాక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఈ వదలకు.. ఇండియాకు లింకు పెట్టే పని మొదలెట్టారు కొంత మంది పాకిస్థానీయులు. ఈ విషయంలో ఒక వ్యక్తి వివాదాస్పద వ్యాక్యలు చేయడం సంచలనంగా మారింది.
అబుదాబిలో హిందూ దేవాలయమైన BAPS స్వామినారాయణ మందిర్ నిర్మాణానికి.. ఈ వరదలకు లింక్ చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14న అక్కడ ఆలయాన్ని ప్రారంభించారు. గుడి ప్రారంభం తరువాత నెలల వ్యవదిలోనే వరదలు రావడంతో.. ఈ విషయంలో కొత్త వాదనను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వరదలను మతపరమైన ప్రకృతి విధ్వంశంగా సృష్టించే పనిలో ఉన్నారు.
వర్షపాతం అంటే ఏంటో తెలియని ఎడారి వాతావరణానికి పేరుగాంచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)రీసెంట్ గా కనీవినీ ఎరుగని రీతిలో వర్షపాతాన్ని చవిచూసింది, నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ చెప్పిన విషయం ఏంటంటే.. గత 75 ఏళ్ళలో ఇలా అత్యధిక వర్షపాతాన్ని చూడలేదని నివేదించింది. ఇక దుబాయ్‌లో వరదల దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి, ఈ వరదల కారణంగా.. జనజీవనంఅస్థవ్యస్తంగా మారింది.
ఇక సోషల్ మీడియాలో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా ఓ పాకిస్థాన్ వ్యక్తి. దుబాయ్ వరదలపై సంచలన కామెంట్స్ చేశాడు. దుబాయ్ ను వదరలు ముంచెత్తడం దైవిక ప్రతీకారంగా అతను అభివర్ణించాడు. దుబాయ్ లో BAPS మందిర్ నిర్మాణం వల్లే ఇలా జరుగుతున్నట్టు ఆరోపించాడు. విగ్రాహారాధుల కోసం ఒక దేవాలయం కట్టడం దీనికి కారణం గా పేర్కొన్నాడు.
"విగ్రహాలు విరగ్గొట్టేవారి దేశంలో విగ్రహారాధన చేసేవారి కోసం దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి.. దుబాయ్ అల్లా యొక్క ఆగ్రహాన్ని గురయ్యాంది. అల్లా ఆగ్రహమే ఇలా వరదలు రూపంలో ప్రజలు ఫేస్ చేసేలా చేసింది అన్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.
2015లో UAEలో పర్యటన సందర్భంగా, PM మోడీ అబుదాబిలో హిందూ దేవాలయం కట్టాలని.. చర్చలను ప్రారంభించింది. తరువాత BAPS ఆలయ నిర్మాణానికి UAE ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఫిబ్రవరి 14 న ఆలయ ప్రారంభోత్సవం తరువాత, PM మోడీ అద్భతంగా మాట్లాడారు. భారతదేశంలోని 1.3 బిలియన్ల పౌరుల తరపున UAE నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
"యుఎఇ ప్రెసిడెంట్ ప్రభుత్వం పెద్ద హృదయంతో కోట్లాది మంది భారతదేశపు కోరికను నెరవేర్చింది. ఇక్కడే కాదు, వారు 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు" అని ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో ఆయన అన్నారు మోది.ఈ ఆలయం మొత్తం ప్రపంచానికి మత సామరస్యం మరియు ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా మారుతుంది. అని ప్రధాని మోదీ అన్నారు.
ఇక ఇప్పుడు దుబాయ్ వరదలను.. హిందూ దేవాలయాలకు ముడిపెట్టడంపై సోషల్ మీడియాలో భారతగా వ్యాతిరేకత వస్తుంది. పాకిస్థాని వ్యక్తి చేసిన కామెంట్స్ పౌ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.