శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్,పాకిస్తాన్ దేశాలచ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఈ సమస్యపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడానికి విముఖత చూపింది. దీంతో లడ్దాఖ్ సమీపంలో పాక్ సైనిక సామాగ్రిని తరలిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

లడ్దాఖ్ సమీపంలోని ఫార్వర్డ్ బేస్ లకు పాక్ బలగాలు యుద్ధసామాగ్రిని తరలిస్తుండడంపై భారత్ కూడ ఓ కన్నేసింది. స్కర్ట్ ఎయిర్ బేస్ వద్ద పాక్ యుద్ద విమనాలను తరలిస్తోందని కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ వర్గాలే చెప్పినట్టుగా  ఆ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

పాకిస్తాన్ కు చెందిన మూడు సీ-130 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు యుద్ద పరికరాలను స్కర్టు ఎయిర్ బేస్ కు తరలించినట్టుగా ఆ మీడియా కథనాల్లో ఉంది.పాకిస్తాన్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టుగా భారత్ కూడ ప్రకటించింది.

యుద్ద సమయంలో విమనాలకు ఉపయోగించే సామాగ్రిని పాక్ తరలించినట్టుగా భారత్ అభిప్రాయపడుతోంది. జేఎఫ్-17 యుద్ద విమానాలను కూడ పాకిస్తాన్ తరలించేందుకు సన్నద్దమైందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

లడ్ధాఖ్ కు అత్యంత సమీపంలోనే పాక్ కు చెందిన స్కర్టు ఎయిర్ బేస్ ఉంటుంది. సరిహద్దులో పాక్ చేపట్టే సైనిక ఆపరేషన్స్ కు ఎక్కువగా ఈ ఎయిర్ బేస్ నే పాకిస్తాన్ ఉపయోగించుకొంటుంది. 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ పార్లమెంట్ లో ప్రసంగించే సమయంలో ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పుల్వామా దాడి తరహా దాడులు మరిన్ని చోటు చేసుకొనే అవకాశం ఉందన్నారు. అంతేకాదు యుద్దం కూడ తప్పదేమోననే వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ చేసిన విషయం తెలిసందే.

సంబంధిత వార్తలు

యుద్దం తప్పదేమో: 370 ఆర్టికల్ రద్దుపై ఇమ్రాన్ సంచలనం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుపై చైనా దుర్బుద్ధి: వత్తాసు పలికిన పాకిస్తాన్

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా