న్యూఢిల్లీ:ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దం తప్పదేమోనని ఆయన వ్యాఖ్యానించారు. పుల్వామా తరహా ఘటనలకు దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వ్యాఖ్యానించారు.

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై మంగళవారం నాడు పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.కాశ్మీర్ పై భారత్ తీసుకొన్న నిర్ణయం భారత్, పాక్ మధ్య సంప్రదాయ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీరీలను ఎంత అణగదొక్కితే తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ సమస్యపై మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి హిందువుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా చూస్తారని ఇమ్రాన్ విమర్శించారు.

భారత్ ను ముస్లింలు సుదీర్ఘంగా పాలించారని ఈ విషయంలో బీజేపీకి ముస్లింలు అంటే కోపమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  భారత్  తమపై దాడికి దిగితే తాము ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఇది ఇరు దేశాల మధ్య సంప్రదాయ యుద్దానికి దారితీసే అవకాశం ఉందని  ఆయన పార్లమెంట్‌లో చెప్పారు. 

అణ్వస్త్ర దేశాల మధ్య యుద్దం జరిగితే విపరీతాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితి అంతర్జాతీయంగా విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

భారత్ తీసుకొన్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్ తో మంచి సంబంధాలను తాను కోరుకొన్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుపై చైనా దుర్బుద్ధి: వత్తాసు పలికిన పాకిస్తాన్

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా