న్యూఢిల్లీ: పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసునని కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే  జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుపై విపక్ష సభ్యుల ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు.జమ్మూ కాశ్మీర్  భారత్‌లో అంతర్భాగమేనని ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారని  ఆయన చెప్పారు.

నెహ్రు అవలంభించిన విధానాల కారణంగానే  పీవోకే భారత్‌కు కాకుండా పోయిందన్నారు.  కాంగ్రెస్ చేసిన తప్పును సరి చేసేందుకు 71 ఏళ్లు పట్టిందని  కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. 

నాగా ఒప్పందానికి ఆర్టికల్ 370కు ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా ప్రకటించారు. 370 ఆర్టికల్‌ను ఆర్టికల్ 371తో పోల్చి చూడవద్దని అమిత్ షా కోరారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,ఈశాన్య రాష్ట్రాలు భయాందోళనలు చెందకూడదని అమిత్ షా తేల్చి చెప్పారు.

ఆర్టికల్ 370 కారణంగానే కాశ్మీర్ ఇంతకాలం పాటు దూరమైందని  అమిత్ షా అభిప్రాయపడ్డారు. 1948లో భారత సైన్యం బాలాకోట్ వరకు  పాక్ సైన్యాన్ని  వెంటాడిందన్నారు. ఆ సమయంలో నెహ్రు భారత సైన్యాన్ని  తిరిగి రప్పించడంతో పీఓకే భారత్‌కు కాకుండా పోయిందన్నారు.ఎవరితో సంప్రదింపులు జరపకుండానే నెహ్రు ఆర్టికల్ 35 ను ఆకాశవాణిలో ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. 


ఏపీ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని  అమిత్ షా ఆరోపించారు.  ఏపీ రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ బిల్లును వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.  కానీ, పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ ప్రసారాలను ఆపి  బిల్లును పాస్ చేయించారని అమిత్ షా విమర్శించారు.

ఏపీ బిల్లును ఆమోందించిన  రోజే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆయన అభిప్రాయపడ్డారు. హురియత్ నేతలతో ఎలాంటి చర్చలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. కాశ్మీర్ నుండి బలగాలను వెనక్కు పిలిపించే సమస్యే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఆడపిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పెళ్లి చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు.


సంబంధిత వార్తలు

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా