న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దును ఛాలెంజ్ చేస్తూ మంగళవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం నాడు ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. 

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీని పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడాన్ని పిటిషన్ దారుడు తప్పుబట్టారు. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ మేరకు  మంగళవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

బుధవారం నాడు ఈ బిల్లును అత్యవసరంగా విచారించాలని  అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.సోమవారం నాడు రాజ్యసభలో కాశ్మీర్ విభజన బిల్లుపై ఓటింగ్ జరిగింది. 370 ఆర్టికల్‌ రద్దుకు రాజ్యసభ ఆమోదం పొందింది.

జమ్మూకాశ్మీర్ విభజనను పిటిషన్ దారుడు తప్పుబట్టారు. మరో వైపు ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఉండేది. ఈ ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం విభజించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 

సంబంధిత వార్తలు

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా