Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును టీఎంసీ వ్యతిరేకించింది.ఈ బిల్లుపై ఆ పార్టీ సభ్యుడు సుదీప్ బంధోపాద్యాయ లోక్‌సభలో మంగళవారం నాడు ప్రసంగించారు. 

jammu kashmir reorganisation bill:tmc stages walkout in loksabha
Author
New Delhi, First Published Aug 6, 2019, 2:09 PM IST

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును నిరసిస్తూ మంగళవారం నాడు లోక్‌సభ నుండి ఆ పార్టీ వాకౌట్ చేసింది.

మంగళవారం నాడు లోక్‌‌సభలో కాశ్మీర్ విభజన బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై లోక్‌సభలో టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాద్యాయ  పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్  విభజనను టీఎంసీ సభ్యుడు బంధోపాద్యాయ  తీవ్రంగా వ్యతిరేకించాడు. 

సభలో ఉంటే ఈ బిల్లును సమ్మతించడమో, వ్యతిరేకించడమో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ రెండు తనకు ఇష్టం లేదని బంధోపాద్యాయ ప్రకటించారు. ఈ బిల్లును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టుగా ఆయన లోక్‌సభలో ప్రకటించారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి బంధోపాద్యాయ  లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు.

జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన  వెంటనే కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు.ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మనీష్ తివారీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా

Follow Us:
Download App:
  • android
  • ios