న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఏఐఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఆ పార్టీ అధినేత, ఎంపీ  అదుద్దీన్ ఓవైసీ.దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని విమర్శించారు. జమ్ముకశ్మీర్ విభజనపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. 

కేంద్రప్రభుత్వం కూడా తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భారత్ కూడా చైనాలా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. గతంలో నానాజీల పాలనఎలా ఉందా అలాంటి పాలన తీసుకువచ్చేలా చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

జమ్ముకశ్మీర్ విభజన బిల్లు చారిత్రాత్మక పెద్ద తప్పిదం అంటూ అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్ విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ లో కర్ఫ్యూ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ లో గతంలో ఎలాంటి పరిస్థితి అయితే ఉందో అలాంటి పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.   
 

ఈ వార్తలు కూడా చదవండి

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా