న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్  విభజన విషయమై చర్చ జరిగే సమయంలో  ఏపీ రాష్ట్ర విభజన అంశం కూడ  లోక్‌సభలో చర్చకు వచ్చింది.ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్దం సాగింది.

మంగళవారం నాడు లోక్‌సభలో జమ్మూకాశ్మీర్  విభజన  బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయమై కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారి ప్రసంగించారు.సోమవారం నాడు రాజ్యసభలో  ఏపీ రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తావించారు. మరోసారి  మంగళవారం నాడు కూడ అమిత్ షా ఇవే వ్యాఖ్యలను మరోసారి  గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మనీష్ తివారీ స్పందించారు. ఏపీ రాష్ట్ర  విభజన సమయంలో చోటు చేసుకొన్న అంశాలను మనీష్ తివారీ గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీని  సంప్రదించినట్టుగా మనీష్ తివారీ ప్రకటించారు. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన విషయంలో  మాత్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించలేదని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు కూడ జోక్యం చేసుకొన్నారు. ఏపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్  విభజించి... కాశ్మీర్ విషయంలో మాత్రం విభజనను తప్పుబట్టడంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం  చేశారు.

ఆర్టికల్ 3 ప్రకారంగానే ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించినట్టుగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రకటించారు.2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించింది. 

 

సంబంధిత వార్తలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా