న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుపై చైనా స్పందించింది. జమ్ముకశ్మీర్ విషయంలో భారతప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది.  చర్యను తీవ్రంగా ఖండించింది. 

కశ్మీర్‌ విషయంలో భారత్‌ వ్యవహరించిన తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ చైనా విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేయడం సహా, కశ్మీర్ ను రెండుగా విభజించడాన్ని తప్పుబట్టింది. 

జమ్ముకశ్మీర్ అంశం అంతర్జాతీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదంటూ తన ప్రకటనలో తెలిపింది. 

అయితే చైనా విడుదల చేసిన ప్రకటనకు పాకిస్తాన్ వత్తాసు పలికింది. భారత్ తీరును తప్పుపడుతూ చేసిన చైనా ప్రకటనను సమర్థించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. జమ్ముకశ్మీర్ విభజనపై సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మిత్ర దేశమైన చైనాకు ఫోన్ చేశారు. అయితే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు చైనా. 

చైనాతో పాటు ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ అంతర్గత వ్యవహారమంటూ పేర్కొంటున్నాయి. అయితే జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపిన తర్వాత చైనా స్పందించింది. భారత్ చర్యను తీవ్రంగా ఖండించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా