MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Oil Crisis: ప్రపంచమంతా ఆయిల్ కొరత వచ్చినా.. ఈ దేశానికి మాత్రం ఏం కాదు. ఏందుకంటే.?

Oil Crisis: ప్రపంచమంతా ఆయిల్ కొరత వచ్చినా.. ఈ దేశానికి మాత్రం ఏం కాదు. ఏందుకంటే.?

Oil Crisis: ఇరాన్‌ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత్ లాంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఒక దేశంపై ప్ర‌భావం ప‌డ‌డం లేదు. ఇంతకీ ఏంటా దేశం, దీనికి కారణం ఏంటంటే..

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 18 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రకృతి శక్తితో నడిచే దేశం
Image Credit : Asianet News

ప్రకృతి శక్తితో నడిచే దేశం

ప్ర‌పంచ‌మంతా ఆయిల్ కొర‌త వ‌చ్చినా ఐస్‌లాండ్‌పై పెద్ద‌గా ప్ర‌మాదం ప‌డ‌దు. ఐస్‌లాండ్ ప్రత్యేకత ఏమిటంటే… ఇది తన మొత్తం విద్యుత్ అవసరాల్లో 85% నుంచి 90% వరకు సహజ వనరుల నుంచే పొందుతుంది. ఈ దేశం ఫాజిల్ ఫ్యూయల్స్ (పెట్రోల్, డీజిల్)పై చాలా తక్కువ ఆధారప‌డుతుంది. ఈ దేశంలో ప్రకృతి వనరులు సమృద్ధిగా ల‌భిస్తాయి. భవిష్యత్ ఎనర్జీ మోడల్‌గా ప్రపంచం ఈ దేశాన్ని చూస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జియోథర్మల్ ఎనర్జీ – ప్రధాన బలం
Image Credit : @UniqBeauties/X

జియోథర్మల్ ఎనర్జీ – ప్రధాన బలం

ఐస్‌లాండ్‌లో ఎక్కువగా అగ్నిపర్వత ప్రాంతాలు ఉన్నాయి. అందుకే భూమి లోపల ఉన్న వేడిని (Geothermal Energy) వినియోగిస్తారు. దేశంలో సుమారు 65% ఎనర్జీ ఈ జియోథర్మల్ ద్వారా వస్తుంది. ఇళ్లను వేడి చేయడం, నీటి సరఫరా, పరిశ్రమలు వంటివ‌న్నీ దీనిపైనే ఆధారపడతాయి. ఆయిల్ లేదా గ్యాస్ అవసరం చాలా తక్కువగా ఉంటుంది.

34
హైడ్రో పవర్ – మరో కీలక వనరు
Image Credit : Getty

హైడ్రో పవర్ – మరో కీలక వనరు

ఐస్‌లాండ్‌లో గ్లేసియర్‌ల నుంచి వచ్చే నదులు, జలపాతాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఎనర్జీలో 20% నుంచి 25% వరకు హైడ్రో పవర్ ఉంటోంది. ఇది నిరంతరంగా లభించే శక్తి. ఇది పూర్తిగా పున‌రుత్ప‌త్తి అయ్యే వ‌న‌రు కావ‌డంతో త‌క్కువ ఖ‌ర్చుతో విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది బలమైన ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రకృతి వనరులు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో సాధారణ ప్రజలకు భారీ లాభం చేకూరుతోంది.

44
ట్రాన్స్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
Image Credit : @guidetoiceland/X

ట్రాన్స్‌పోర్ట్‌లో కొత్త మార్పులు

ప్రపంచం ఇంకా పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతుండగా… ఐస్‌లాండ్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ వాహనాల వైపు వేగంగా మారుతోంది. భవిష్యత్తులో పూర్తిగా ఫ్యూయల్ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేవ‌లం ఐస్‌లాండ్ మాత్ర‌మే కాకుండా నార్వే, స్వీడ‌న్‌, పరాగ్వే, కోస్టారికా లాంటి దేశాలు కూడా ఎక్కువగా రిన్యూవబుల్ ఎనర్జీనే ఉపయోగిస్తున్నాయి.

మొత్తంమీద ప్రపంచం మొత్తం ఆయిల్‌పై ఆధారపడుతున్న ఈ కాలంలో… ఐస్‌లాండ్ చూపిస్తున్న మార్గం చాలా ముఖ్యమైనది. ప్రకృతి వనరులను సరిగ్గా వినియోగిస్తే ఇంధన సమస్యలు తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి, పర్యావరణం కాపాడుకోవ‌చ్చు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
యుద్ధం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్ర‌తీది భూత‌ద్దంలో చూస్తారు.. వీరితో ప్రేమ కాస్త క‌ష్ట‌మే
Recommended image2
Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved