పాకిస్తాన్ పార్లమెంట్ ను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పుల్వామా దాడి జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా తరహాలో దాడులకు భారత్ అవకాశం కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
మంగళవారం నాడు పార్లమెంట్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ .ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పూల్వామా దాడికి పాకిస్తాన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాశ్మీర్ ప్రజలను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముస్లింలను రెండో తరగతి ప్రజలుగా బీజేపీ చూసే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. మహ్మద్ అలీ జిన్నా రెండు దేశాల థియరీని భారత్ అవలంభించిందని ఆయన ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ ఇండియాను కేవలం హిందూవుల కోసం ఉండాలని కోరుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలు మాత్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలని కోరుకొందన్నారు. కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు కూడ ఇదే విషయాన్ని తనకు చెప్పారని ఆయన పార్లమెంట్‌లో ప్రకటించారు.
సంబంధిత వార్తలు
ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా
పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్
కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్
కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు
సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్ విభజనపై రాహుల్
కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు
