న్యూఢిల్లీ: ఆక్రమిత కాశ్మీర్ కూడ భారత్‌లో  భాగస్వామ్యమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కోసం తన ప్రాణాన్ని కూడ ఫణంగా పెట్టేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

మంగళవారంనాడు జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అమిత్ షా ప్రసంగానికి అడ్డుపడ్డారు. విపక్షాల నిరసనల మధ్య అమిత్ షా ప్రసంగించారు.ఈ సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకొన్నాడు. 

 జమ్మూకాశ్మీర్ విభజన బిల్లు దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా  ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుతో జమ్మూ కాశ్మీర్ కు ప్రయోజనం కలుగుతోందని  అమిత్ షా చెప్పారు. 

ఆర్టికల్ 370 డి ద్వారా దేశంలోని పలు సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయయని  అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370 డిని రద్దు చేస్తూ నిన్ననే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారని  అమిత్ షా ప్రకటించారు.

ఆక్రమిత కాశ్మీర్ కూడ భారత్‌లో భాగస్వామ్యమని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను సంపూర్ణంగా భారత్‌లో విలీనం చేయనున్నట్టు అమిత్ షా తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్  ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుకొంటుందా అని ఆయన ప్రశ్నించారు.  

సంబంధిత వార్తలు

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా