Asianet News TeluguAsianet News Telugu

బిన్ లాడెన్ అమరవీరుడు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు

లాడెన్‌ని అమరవీరుడు అని చెప్పడం ఇమ్రాన్ తెలివి తక్కువ తనానికి నిదర్శనమని మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్ అన్నారు. 

In Parliament, PM Imran Khan calls Osama Bin Laden a martyr
Author
Hyderabad, First Published Jun 26, 2020, 8:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిన్ లాడెన్... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరయా అంటే ముందు ఆయన పేరు వినపడుతుంది. ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బిన్ లాడెన్ ని చాలా మంది అసహ్యించుకుంటారు. అలాంటి వ్యక్తిని అమరవీరుడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అది మరెవరో కాదు.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ ఈ మాటలు అన్నాడు. లాడెన్‌ని హతమార్చడం మొదలు అమెరికా, తమ దేశాన్ని ఎన్ని విషయాల్లో ఇబ్బందులు పెట్టిందో చెప్పుకొచ్చాడు ఇమ్రాన్. ఈ నేపథ్యంలో అబ్బొటాబాద్‌కి వచ్చిన అమెరికన్లు లాడెన్‌ని చంపేశారని.. అతడొక అమరవీరుడు అని అన్నాడు.

ఇక ఆ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. సొంత దేశంలో కూడా ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాడెన్‌ని అమరవీరుడు అని చెప్పడం ఇమ్రాన్ తెలివి తక్కువ తనానికి నిదర్శనమని మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్ అన్నారు. ఉగ్రవాదం పేరిట ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పాక్ ప్రతిష్టను ఇమ్రాన్ ఖాన్ మరింత దిగజారుస్తున్నారని మీనా గబ్బేనా అనే సామాజిక కార్యకర్త ట్వీట్ చేశారు. అంతేకాదు ఉగ్రవాదులకు, పాక్‌కు ఉన్న సంబంధం ఏంటో మరోసారి బయటపడిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రపంచంలోని అతి ఘోర మారణహోమాల్లో ఒకటైన 9/11కు బిన్ లాడెన్ కారకుడు. 2001లో అతడి ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చెందిన ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చారు. అందులో 3 వేల మంది చనిపోగా.. 25వేలకు పైగా గాయపడ్డారు. దీంతో అమెరికా ఉలిక్కిపడగా.. ప్రపంచం కూడా వణికిపోయింది. దీంతో లాడెన్‌ని చంపాలని శపథం చేసుకున్న అమెరికా.. కొన్ని సంవత్సరాల పాటు ట్రేస్ చేసి మరి చంపిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios