MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • టైట్ జీన్స్, హ్యాండ్ బ్యాగ్, బ్రా, హై హీల్స్ .. వీటిని వాడితే మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా?

టైట్ జీన్స్, హ్యాండ్ బ్యాగ్, బ్రా, హై హీల్స్ .. వీటిని వాడితే మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా?

ఫ్యాషన్‌గా కనిపించేందుకు, స్టైలీష్ గా రెడీ అయ్యేందుకు మనలో చాలా మంది రకరకాలుగా రెడీ అవుతుంటారు. అలవాటే లేకున్నా.. స్టైల్ గా కనిపించేందుకు రకరకాల వస్తువులను కూడా వాడుతుంటారు. ఇవి మనల్ని లేనిపోని రోగాల బారిన పడేస్తాయి. వీటిలో జీన్స్ కూడా ఉంది.  

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 21 2024, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మనం అప్ డేట్ కాకపోతే.. బతకలేం అనుకుంటారు చాలా మంది. అందుకే అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌తో వాళ్లను వారు అప్డేడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీనిలో తప్పేం లేదు. చాలా మంది ట్రెండుకు తగ్గట్టు లేకపోతే.. వారిని మనుషులుగా చూడటం కూడా మానేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నావంటూ వెక్కిరించడం మొదలుపెడుతుంటారు. దీనివల్లే చాలా మంది మారుతున్న కాలానికి అనుగుణంగా వారి అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ పరంగా. కానీ ఈ ఫ్యాషనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల వారికి తెలియకుండానే ఎంతోమంది అమ్మాయిలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ మన ఆరోగ్యాన్ని లేదా జీవనశైలిని ఏ విధంగానైనా ప్రభావితం చేస్తే దానికి దూరంగా ఉండటమే మంచిది. స్టైలీష్ కోసం వాడే కొన్ని వస్తువుల వల్ల వచ్చే సమస్యల  గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26
high heels

high heels

హైహీల్స్

మోడ్రన్ , వెస్ట్రన్ డ్రెస్సుల మీదికి చాలా మంది ఫ్లాట్ చెప్పులకు బదులుగా హై హీల్స్ నే ఎక్కువగా వాడుతుంటారు. వీళ్లతో పాటుగా పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా కనిపించాలని కూడా హై హీల్స్ ను వేసుకుంటుంటారు. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని వేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. హైహీల్స్ ని ఎప్పుడూ వేసుకోవడం వల్ల పాదాల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 

36
high heels

high heels

మీకు తెలుసా? హై-హీల్స్ ను వేసుకోవడం వల్ల చీలమండలు, మోకాలు, మడమలు వంటి చాలా ప్రాంతాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే మొత్తం ఒత్తిడి పాదం, ముందు భాగం పైనే పడుతుంది. ఇది వెన్నెముక, మోకాళ్లు, పాదాల్లో ప్రమాదకరమైన నొప్పి, సమస్యలకు దారితీస్తుంది. 

46
<p>Jeans</p>

<p>Jeans</p>


టైట్ జీన్స్

అబ్బాయిలకంటే అమ్మాయిలే టైట్ జీన్స్ ను వేస్తారు. ఇది మంచి షేప్ ను ఇస్తుంది. కానీ ఆడవాళ్లు చేసే అతిపెద్ద తప్పుల్లో ఇది ఒకటి. టైట్ జీన్స్ చూడాలనుకుంటే ఇది అందమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా.. మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా టైట్ జీన్స్ పొత్తికడుపు ప్రాంతంలో బాగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, త్రేనుపు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.

మీరు ఎప్పుడూ టైట్ జీన్స్ ను వేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీనివల్ల మీ నరాల పనితీరు ప్రభావితమవుతుంది. ఇది విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను కలిగిస్తుంది. దీనిని టైట్ జీన్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
 

56

హ్యాండ్ బ్యాగ్

పెళ్లైన ఆడవారే కాదు.. పెళ్లికాని ఆడవారు కూడా ఖచ్చితంగా హ్యాండ్‌బ్యాగ్‌ ను వేసుకుంటారు. కానీ వీటిని మీరు వేసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటికి వెళ్లేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నింటినీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి తీసుకెళ్తుంటాం. అయితే చాలా మంది ఆడవారే చేసే అతిపెద్ద తప్పు.. అవసరం ఉన్నా.. లేకున్నా.. చేతికి దొరికినవన్నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తుంటారు.  ఈ వస్తువులన్నింటినీ బుజానికి వేసుకుని మోయడం వల్ల భుజం, చేయి , మెడ ప్రాంతాలపై చాలా ఒత్తిడి పడుతుంది.  అలాగే భుజం నొప్పి, మెడ నొప్పి, ఒత్తిడి, మెడ ఎముకలలో నొప్పి, వెన్నెముకలో నొప్పి కలుగుతుంది. 

66


పంప్-అప్ బ్రా

ఆడవాళ్లు లో దుస్తుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది బ్రా దరిస్తే.. మరికొంత మంది వీటికి దూరంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ కాలంలో బ్రాలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇంతకు ముందు ఇప్పుడు ఉన్నన్ని బ్రా రకాలు ఉండేవి కావు. ఆకర్షణీయంగా,  ఫ్యాషన్‌గా ఉండటానికి పుష్-అప్ బ్రాలు, పంప్ అప్ బ్రాలు, బాల్కనెట్ బ్రాలు, స్ట్రాప్‌లెస్ బ్రాలు వంటి బ్రాలను మహిళలు ఎక్కువగా ధరిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది టైట్ బ్రాలు వేసుకుంటారు. కానీ ఇవన్నీ రొమ్ములపై ​​ఒత్తిడిని పెంచుతాయి. అలాగే శ్వాస సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Earrings: గుండ్రటి ముఖానికి సూపర్‍గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్
Recommended image2
Red Stone Necklace: మీ అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ నెక్లెస్‌లు
Recommended image3
Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ తో ప్రీమియం లుక్ మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved