MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్

రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్

Telangana: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్‌ సమీపంలో రెండు రోజులుగా ఒక కారు ఉండ‌డం, కారులోంచి దుర్వాస రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 21 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండు రోజులుగా ఒకే చోట కారు
Image Credit : Gemini AI

రెండు రోజులుగా ఒకే చోట కారు

ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఒక కారు రెండు రోజులుగా పార్క్‌ చేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాహనం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీ తెరిచి చూడగా అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మృతురాలు మానసగా గుర్తింపు
Image Credit : Gemini AI

మృతురాలు మానసగా గుర్తింపు

కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. వాహనం మానసకు పరిచయమైన వినోద్ అనే వ్య‌క్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలు వినోద్‌ వైపు మళ్లాయి.

వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ

మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మానసతో తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్‌ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు వినోద్‌ పోలీసులకు తెలిపినట్లు స‌మాచారం.

Related Articles

Related image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Related image2
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
34
భయంతో మృతదేహాన్ని కారులో వదిలేశానని వెల్లడి
Image Credit : Gemini AI

భయంతో మృతదేహాన్ని కారులో వదిలేశానని వెల్లడి

మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తీసుకెళ్లి ఎల్కతుర్తి వద్ద వదిలి వెళ్లినట్లు వినోద్‌ చెప్పినట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వాంగ్మూలం నిజమేనా? ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

44
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
Image Credit : Gemini AI

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస మృతి చెందిన పరిస్థితులు, ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది, కారు ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకువచ్చారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వినోద్‌ చెప్పిన విషయాలను ఇతర ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు. మృతదేహానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్‌ వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నేరాలు, మోసాలు
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో అస‌లేం జరుగుతోంది.?
Recommended image2
ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
Now Playing
Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
Related Stories
Recommended image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Recommended image2
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved