MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 6 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 25 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
Image Credit : Chatgpt

ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. మంగళవారం నాటికి ఇది ఒడిశాలోని మారుమూల ప్రాంతాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లా సతివాడలో అత్యధికంగా 4.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర తీరంలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు
Image Credit : Gemini

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసరాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉండటంతో పాటు నైరుతీ రుతుపవనాలు తేమతో నిండిపోయాయి. ఆగస్టు 25 నుంచి 30 వరకు రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో గాలిలో తేమ శాతం 85 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో 85 శాతం, కోస్తా-రాయలసీమల్లో 60 నుంచి 75 శాతం వరకు ఉంది. ఆగస్టు 25 నుంచి 28 మధ్య ఏపీ, యానాం, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులు అంటే గంటకు 40-50 కి.మీ, కొన్నిసార్లు 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

35
తెలంగాణ వెదర్ అప్‌డేట్: ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Gemini

తెలంగాణ వెదర్ అప్‌డేట్: ఈ జిల్లాల్లో వర్షాలు

మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఎండతో పాటు తేమ వల్ల అప్పుడప్పుడు ఒక్కసారిగా ఐదు నిమిషాల చొప్పున గట్టి వర్షపు జల్లులు పడతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు అలర్ట్‌గా ఉండాలి. చెట్ల కింద నిలబడటం లేదా ఆశ్రయం పొందడం అస్సలు మంచిది కాదు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆగస్టు 26 నుంచి క్రమంగా వానలు తగ్గుముఖం పడనున్నాయి.

45
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు.. బీచ్‌లకు వెళ్లేవారు బీ అలర్ట్
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు.. బీచ్‌లకు వెళ్లేవారు బీ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆగస్టు 25న రోజంతా మేఘాలు, ఎండ కలిసిన వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. రాయలసీమలో మేఘాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు కాస్త తక్కువగానే నమోదు కావచ్చు. తీర ప్రాంతాల్లో 37 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. విహారయాత్రలకు లేదా సందర్శనకు బీచ్‌లకు వెళ్లేవారు సముద్రంలోకి ఎక్కువ దూరం వెళ్లకూడదు. అలల తీవ్రత ఎక్కువగా వుంటుందని ఐఎండీ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉంటుంది.

55
గ్లోబల్ వైడ్ గా వాతావరణం ఎలా ఉంది?
Image Credit : Gemini

గ్లోబల్ వైడ్ గా వాతావరణం ఎలా ఉంది?

హిందూ మహాసముద్రంలో ద్రోణి బలంగా ఉంటే, అరేబియా సముద్రంలో గాలులు గంటకు 60 కిమీ, బంగాళాఖాతంలో 65 కిమీ వేగంతో ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏకంగా 5 తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. అందులో 'సాడెల్' తుపాను గంటకు 165 కిమీ వేగంతో చైనా, జపాన్ వైపు కదులుతోంది. 'ఇసెల్లే' తుపాను గంటకు 120 కిమీ వేగంతో ఉత్తర అమెరికా పశ్చిమ భాగానికి వెళ్తోంది. వీటితో పాటు లాలా, 10ఈ, నర్రా తుపాన్లు, అట్సాని వాయుగుండం, మరో 4 అల్పపీడనాలు పసిఫిక్‌లో ఉన్నాయి. ఎల్ నినో తీవ్రత పెరగడం వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోయి, ఆసియా అంతటా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తంగా మారి కొన్నిచోట్ల అసలు వర్షాల్లేకుండా ఉంటే.. పలు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్
Recommended image2
హైద‌రాబాద్‌కు దూరంగా కొత్త రియ‌ల్ హ‌బ్‌.. ఐటీ ఉద్యోగుల చూపంతా అటు వైపే ఎందుకు.?
Recommended image3
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి, 20 మందికి గాయాలు
Related Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved