MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్

Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్

Toxic Review: `కేజీఎఫ్‌ 2` వచ్చిన నాలుగేళ్ల తర్వాత `టాక్సిక్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు హీరో యష్‌. రేపు బుధవారం(ఆగస్ట్ 26)న విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది.

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాక్సిక్‌తో అలరించబోతున్న యష్‌
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌తో అలరించబోతున్న యష్‌

యష్‌.. `కేజీఎఫ్‌` మూవీస్ తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. కన్నడ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఇప్పుడు `టాక్సిక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. `కేజీఎఫ్‌ 2` విడుదలైన నాలుగేళ్లకి యష్‌ ఈ మూవీతో రాబోతున్నారు. గీతా మోహన్‌ దాస్‌ దీనికి దర్శకత్వం వహించగా, దర్శకురాలితోపాటు యష్‌ దీనికి కథ అందించడం విశేషం. కేవీఎన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై కేవీ నారాయణ నిర్మించారు. సుమారు రూ.500-600కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి వారు హీరోయిన్లుగా నటించారు. రాఖీ స్పెషల్‌గా ఈ మూవీ ఆగస్ట్ 26న రిలీజ్‌ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏ సర్టిఫికెట్‌ పొందిన టాక్సిక్‌
Image Credit : X/@KvnProductions

ఏ సర్టిఫికెట్‌ పొందిన టాక్సిక్‌

అయితే ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్‌ని పొందింది. 18ఏళ్లు పై బడ్డ వారే ఈ సినిమాని చూడాలి. దీనికి సంబంధించిన చిత్ర బృందం ఇప్పటికే వార్నింగ్‌ నోట్‌ని రిలీజ్‌ చేసింది. మితిమీరిన రొమాన్స్, యాక్షన్‌, హింస, మ ద్యం, ధూమపానం వంటివి ఇందులో చూపించారట. దీంతో ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాని పెద్ద వాళ్లు మాత్రమే చూడాలి. ఇది మూడు గంటల 14 నిమిషాల నిడివితో ఉంటుందట. సినిమాని ఇప్పటికే కొంత మంది క్రిటిక్స్, బయ్యర్లు చూశారు. వారి రిపోర్ట్ ప్రకారం మూవీ ఎలా ఉందనేది తేలిపోయింది.

Related Articles

Related image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Related image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
36
టాక్సిక్‌ బేసిక్‌ కథ ఇదే
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ బేసిక్‌ కథ ఇదే

ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినా, గోవా మాత్రం పోర్చుగీస్‌ వారి ఆధీనంలోనే ఉంది. హైదరాబాద్‌ నిజాం ఆధీనంలో ఉన్నట్టుగా. అలాంటి సమయంలో గోవాలో ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ చాలా జరుగుతుంటాయి. మాఫియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం, ఆధిపత్యం కోసం పోరాటం, చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం కొన్ని గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ క్రమంలో మితిమీరిన హింస, రక్తపాతం జరుగుతుంటుంది. వెన్నెపోట్లు, మోసం, దగా, పవర్‌ పాలిటిక్స్ కామన్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్‌) ఎలా నిలబడ్డాడు, ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఆయన ఎలాంటి పోరాటం చేశాడు అనేది సినిమా. ఇందులో యష్‌ చెల్లిగా గంగ పాత్రలో నయనతార నటిస్తుంది. ఆయన ప్రియురాలిగా నదియా పాత్రలో కియారా అద్వానీ కనిపించబోతుందట. సొంత చెల్లినే అన్నని చంపేందుకు కుట్ర చేస్తుందట. మరి దానికి కారణం ఏంటి? ఇందులో రుక్మిణి వసంత్‌, హ్యూమా ఖురేషి, తారా సుతారియా పాత్రలేంటి? అనేది సినిమా. మూవీలో మరో హైలైట్‌ ఏంటంటే.. ఇందులో యష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయగా, రూమిగా కనిపిస్తారు. అదే సమయంలో మూడు డిఫరెంట్‌ గెటప్స్ లో ఆయన కనిపించబోతున్నారు.

46
టాక్సిక్ లో హైలైట్స్
Image Credit : X/@KvnProductions

టాక్సిక్ లో హైలైట్స్

సినిమా ఎలా ఉందనేది చూస్తే, రెండు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యష్‌ రెండు పాత్రల్లో ఇరగదీశారట. నట విశ్వరూపం చూపించారని సమాచారం. కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్ ని చూడొచ్చు అంటున్నారు. సినిమా మెయిన్‌గా కథ ప్రధానంగా సాగుతుంది. దీంతో కథలో చాలా డెప్త్ ఉంటుంది. సినిమాని లీనమై చూస్తేనే అర్థమవుతుందంటున్నారు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని టాక్‌. ఇక కియారా అద్వానీతో యష్‌ రొమాంటిక్‌ సీన్లు మతిపోయేలా ఉంటాయట. కుర్రాళ్లకి అవి ట్రీట్‌ అంటున్నారు. కియారా నటన అదిరిపోతుందని అంటున్నారు. నదియాగా ఆమె మైండ్‌ బ్లాక్‌ చేస్తుందట. అదే సమయంలో నయనతార, యష్‌ మధ్య వచ్చే ఎమోషనల్‌, సెంటిమెంట్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. రుక్మిణి వసంత్‌ హ్యూమా ఖురేషి, తారా సుతారియా పాత్రలు సర్‌ప్రైజ్‌ చేస్తాయట.

56
యష్‌ దెబ్బకి బాక్సాఫీసు షేకే
Image Credit : X/@KvnProductions

యష్‌ దెబ్బకి బాక్సాఫీసు షేకే

సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ వాహ్‌ అనిపించేలా, చాలా లావిష్‌గా, గ్రాండియర్‌గా ఉంటుందట. విజువల్‌ ట్రీట్‌ అంటున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌, బీజీఎం సినిమాకి ప్రాణం పోస్తాయని, అవే హైలైట్‌ అని సమాచారం. యాక్షన్‌ సీన్లు సినిమాకి మరో హైలైట్‌ అని, విజిల్స్ వేయిస్తాయని చెబుతున్నారు. టీజర్‌, ట్రైలర్‌లో చూపించినట్టుగా రొమాన్స్, యాక్షన్‌ మాత్రమే కాదు, ఇందులో ఎమోషన్స్ కి ప్రయారిటీ ఉంటుందట. తాను కింగ్ గా ఎదిగేందుకు రాయ చేసిన పోరాటం ఆసక్తికరంగా ఉంటుందని, రాయ, రూమి పాత్రల మధ్య ఫైట్‌ కూడా వాహ్‌ అనిపిస్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు. బాక్సాఫీసు వద్ద సునామీ పక్కా అంటున్నారు. కలెక్షన్లలో కేజీఎఫ్‌ 2ని దాటిపోతుందని చెబుతున్నారు. అయితే సినిమాని చాలా వరకు క్రిటిక్స్ చేత ప్రమోట్‌ చేయిస్తున్నారని, అదంతా పెయిడ్‌ ప్రమోషన్‌ అంటున్నారు. కొంత మంది క్రిటిక్స్ తో ఇలా పెయిడ్‌ పోస్ట్ లు చేయిస్తున్నారనే వాదన ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్‌ క్రిటిక్‌ కేఆర్‌కే పోస్ట్ లు పెడుతున్నాడు. పెయిడ్‌ క్రిటిక్స్ 4 రేటింగ్‌ ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆయన్ని ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు.

66
టాక్సిక్‌కి షాకింగ్ రిపోర్ట్
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌కి షాకింగ్ రిపోర్ట్

కానీ ఆయనే కాదు, ఉమైర్‌ సందు కూడా నెగిటివ్‌ రివ్యూ ఇచ్చాడు. టాక్సిక్‌.. యష్‌ కెరీర్‌లో సాహో లాంటి మూవీ అన్నాడు. యష్‌, తారా సుతారియ జంట బాగుంటుందని, యష్‌ డైలాగ్‌ డెలివరీ అంతగా బాగా లేదని, ఇదొక బీ గ్రేడ్‌, సెమి పో ర్న్ మూవీ అని, స్టంట్స్ బాగా లేవని పోస్ట్ పెట్టాడు. కియారా లుక్‌ బాగుందని, నటన అంతగా లేదని, ఆమె ఒక క్రింజ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. ఇది `యానిమల్‌` మూవీకి కాపీలాంటి చిత్రమన్నాడు. యష్‌.. సినిమాకి కథ, డైలాగ్స్, దర్శకత్వం, నిర్మాణం చేశాడని, ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం సినిమాకి పెద్ద దెబ్బ అంటున్నాడు. ఇది సినిమా డిజాస్టర్‌కి కారణమవుతుందని, మొత్తంగా టాక్సిక్‌ పెద్ద డిజాస్టర్‌ అని, వరస్ట్ మూవీ అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఆయన దీనికి కేవలం 2 రేటింగ్‌ ఇవ్వడం షాకిస్తోంది. ఇలా టాక్సిక్‌ మూవీకి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఆర్‌కేనే కాదు, ఉమైర్‌ సందుని కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉందనేది ఏసియా నెట్‌ ఒరిజినల్ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Related Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved