MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం

మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ తన రిపోర్టును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు అందించింది. ఆరు పేజీల రిపోర్టులో మంత్రి వ్యవహారశైలిపై కమిటీ కీలక అభిప్రాయాలను నమోదు చేసినట్లు సమాచారం.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 25 2026, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణా కమిటీ సిఫారసు
Image Credit : Asianet News

కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణా కమిటీ సిఫారసు

మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆమె కుమార్తె కొండా సుస్మిత పటేల్‌ సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సురేఖపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఆమెకు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వ్యాఖ్యలకు మంత్రి నేరుగా బాధ్యత వహించకపోయినా, పార్టీ నేతగా పరిస్థితిని నియంత్రించే బాధ్యత ఆమెపై ఉంటుందని కమిటీ భావించినట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలనే ప్రతిపాదన కూడా రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అస‌లు వివాదం ఎక్క‌డ మొద‌లైందంటే.?
Image Credit : Asianet News

అస‌లు వివాదం ఎక్క‌డ మొద‌లైందంటే.?

కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కుమార్తె సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించే అధికారం సీఎంకు లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ టికెట్లను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, సీఎం ఒక్కరే అభ్యర్థులను ఖరారు చేయలేరని ఆమె పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. పార్టీలో అసలు కాంగ్రెస్‌ వాదులకు ప్రాధాన్యం తగ్గుతోందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా పరకాల టికెట్‌ విషయంలో తనకు అనుకూల నిర్ణయం రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాననే స్థాయిలో సుస్మిత వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఆమె తల్లి కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

Related Articles

Related image1
Funeral: అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగలగొడతారో తెలుసా.?
Related image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
35
సురేఖ వివరణ ఇచ్చినా.. కమిటీ వెనక్కి తగ్గలేదా?
Image Credit : Asianet News

సురేఖ వివరణ ఇచ్చినా.. కమిటీ వెనక్కి తగ్గలేదా?

షోకాజ్‌ నోటీసుపై కొండా సురేఖ ఇప్పటికే తన వివరణను ఇచ్చారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. స్వతంత్ర వ్యక్తిగా సుస్మిత తన అభిప్రాయాలను వెల్లడించారని, అందుకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని సురేఖ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే ఈ వివరణతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందలేదని తాజా పరిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫారసు చేయడం ద్వారా కమిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

45
చిన్నారెడ్డి వ్యాఖ్యలపైనా కమిటీ చర్యలు
Image Credit : Asianet News

చిన్నారెడ్డి వ్యాఖ్యలపైనా కమిటీ చర్యలు

ఇదే సమయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి వ్యవహారం కూడా క్రమశిక్షణా కమిటీ పరిశీలనకు వచ్చింది. వనపర్తి రాజకీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరో వివాదానికి కారణమయ్యాయి. తనకు కాకుండా డబ్బుల ప్రభావంతో ఇతరులకు టికెట్లు ఇచ్చారంటూ చిన్నారెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి మాదిరిగా తాను కూడా పార్టీపై తిరుగుబాటు చేసే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా కమిటీ నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. తాజాగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు మల్లు రవి వెల్లడించారు. ప్లానింగ్‌ కమిషన్‌ పదవి నుంచి ఆయనను తొలగించాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు స‌మాచారం.

55
రేవంత్‌తో మల్లు రవి భేటీ
Image Credit : Telangana CMO/X

రేవంత్‌తో మల్లు రవి భేటీ

క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌, ఎంపీ మల్లు రవి ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. నేతలు తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని సూచించారు.

కమిటీ రిపోర్టును టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు అందించిన అనంతరం ఈ అంశాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ద్వారా హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మల్లు రవి తెలిపారు. తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇక సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ, కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉందని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడబోనని, కమిటీ తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Recommended image2
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?
Recommended image3
Hyderabad Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్ లో వెళ్ళారో బుక్ అవ్వడం ఖాయం
Related Stories
Recommended image1
Funeral: అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగలగొడతారో తెలుసా.?
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved