MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Telangana
  • School Holidays : ఈ శని, ఆది, సోమవారం సెలవులు కన్ఫర్మ్... వచ్చే గురువారం మరో హాలిడే రెడీ

School Holidays : ఈ శని, ఆది, సోమవారం సెలవులు కన్ఫర్మ్... వచ్చే గురువారం మరో హాలిడే రెడీ

పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 17న సెలవు ఉంది… కాారణాలు వేరే అయినప్పటికీ తెలంగాణలో కూడా ఈరోజు విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఎందుకో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 10 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వచ్చేవారం సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

వచ్చేవారం సెలవులే సెలవులు

School Holidays : ఈ వినాయక చవితికి విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 14న అంటే వచ్చే సోమవారం వినాయక చవితి ఉంది... ఈ పండక్కి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఇచ్చాయి. అయితే సెప్టెంబర్ 12 రెండో శనివారం, సెప్టెంబర్ 13 ఆదివారం... ఈ రెండ్రోజులు కూడా సెలవే... అంటే వినాయక చవితికి వరుసగా మూడ్రోజులు సెలవులే అన్నమాట.

వినాయక చవితిని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ప్రతిచోటా ఘనంగా జరుపుకుంటారు… బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. వీధివిధినా, వాడవాడనా వినాయక మండపాలు దర్శనమిస్తాయి... యువతతో పాటు చిన్నాపెద్దా అందరూ ఇక్కడ ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇలాంటివారు ఎగిరిగంతేసేలా వచ్చేవారం మరో సెలవు కలిసిరానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సెప్టెంబర్ 17న సెలవేనా?
Image Credit : Getty

సెప్టెంబర్ 17న సెలవేనా?

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోయే రోజు... ఇదేరోజు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యింది. అంటే తెలంగాణలో నిజాం రాజుల పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమయ్యింది... కాబట్టి తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం ఈరోజే వచ్చిందన్నమాట. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

సెప్టెంబర్ 17ను ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటుంది… బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఇంకొందరు తెలంగాణ విలీన దినోత్సవం అనేవారు. ఇక పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమాలు జరిపేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుతోంది.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది రేవంత్ సర్కార్. తెలంగాణవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జెండాను ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి.

అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారిక సెలవేమీ ప్రకటించలేదు. అకడమిక్ క్యాలెండర్ లోనూ ఈ సెలవు గురించి ప్రస్తావన లేదు. కానీ గత అనుభవాలరిత్యా ఈరోజు సెలవు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి... ఇందుకు సంబంధించిన అధికారిక జీవో ఎప్పుడైనా వెలువడవచ్చు. ఈరోజు జెండా ఆవిష్కరణ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయేలా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Vinayaka Chavithi Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Related image2
Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
33
ఇక్కడ సెప్టెంబర్ 17న అధికారిక సెలవే
Image Credit : Getty

ఇక్కడ సెప్టెంబర్ 17న అధికారిక సెలవే

సెప్టెంబర్ 17న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే విశ్వకర్మ జయంతి (విశ్వకర్మ పూజ) కూడా ఉంది. పలు రాష్ట్రాల్లో ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు... అందుకే అక్కడ అధికారిక సెలవు ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవే. ఇక పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లోనూ ఈరోజు సంపూర్ణ సెలవే. అయితే కర్ణాటకా, రాజస్ధాన్, పంజాబ్, హర్యానా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో మాత్రం ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Telangana: క‌నీస‌వేత‌నం రూ. 16 వేల‌కు పెంపు.. 1.10 కోటి మందికి ప్ర‌యోజ‌నం
Recommended image3
Telangana: ఇదీ బీఆర్ఎస్ అస‌లు రూపం.. ద‌ళితులు నిర‌స‌న తెలిపితే, శుద్ధి చేస్తారా.?
Related Stories
Recommended image1
Vinayaka Chavithi Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved