MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Telangana
  • ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?

ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?

School Holiday: తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలకు రేపు (ఆగస్టు 21) సెలవు ప్రకటించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 20 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు పిలుపు
Image Credit : Asianet News

ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు పిలుపు

కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. రూపారెడ్డి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాలలు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఆగ‌స్టు 21న‌) ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించబోమని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరలక్ష్మీ వ్రతం.. ఇప్పటికే ఆప్షనల్ హాలిడే
Image Credit : Asianet News

వరలక్ష్మీ వ్రతం.. ఇప్పటికే ఆప్షనల్ హాలిడే

రేపు వరలక్ష్మీ వ్రతం కావడంతో పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే ఐచ్ఛిక సెలవును ప్రకటించింది. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు రేపు సెలవు ఉండనుంది. అయితే ఈ సెలవుకు ప్రధాన కారణం రూపారెడ్డి హత్యకు నిరసనగా అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపు. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో ఉన్న ప్రభుత్వ ఆప్షనల్ హాలిడే దీనికి అదనంగా ఉంది.

Related Articles

Related image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Related image2
Human Eye: మ‌నిషి క‌న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్‌తో స‌మాన‌మో తెలుసా?
35
ప్రిన్సిపల్ రూపారెడ్డి ఎలా హత్యకు గురయ్యారు?
Image Credit : Asianet News

ప్రిన్సిపల్ రూపారెడ్డి ఎలా హత్యకు గురయ్యారు?

కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి ఈ నెల 11న తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ ఘటన వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులకు అనేక అనుమానాలు వచ్చాయి. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు మైనర్ విద్యార్థులు రూపారెడ్డి ఇంట్లో డబ్బు ఉంటుందని భావించారు. పాఠశాల ఫీజుల వసూళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో నగదు ఉండొచ్చని అంచనా వేసి, ఘటనకు ఐదు రోజుల ముందే చోరీకి ప్రణాళిక వేసుకున్నారు. ఇంటి పరిసరాలు, సీసీ కెమెరాలు, అనుకూల సమయాన్ని పరిశీలించిన తర్వాత పథకం అమలు చేశారు.

స్కూల్‌ ముగిసిన తర్వాత ఇద్దరిలో ఒకరు మాస్క్, హుడీ ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంట్లోకి వెళ్లిన సమయంలో మాస్క్ తొలగిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తించారు. ఆమె అతడిని ‘బాబు’ అని పిలిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన గుర్తింపు బయటపడటంతో నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రూపారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

45
ఒక్క మాటతో విద్యార్థులపై పోలీసుల అనుమానం
Image Credit : Asianet News

ఒక్క మాటతో విద్యార్థులపై పోలీసుల అనుమానం

రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఆమె చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడిన సమయంలో ఉపయోగించిన ‘బాబు’ అనే మాట కీలకంగా మారింది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూనే పాఠశాల విద్యార్థుల కదలికలపై దృష్టి సారించారు. దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. హత్య తర్వాత పాఠశాలకు కొన్ని రోజులు సెలవు ఇవ్వగా.. తిరిగి స్కూల్ ప్రారంభమైన సమయంలో గైర్హాజరైన విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించారు. వారిలో పదో తరగతికి చెందిన కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక విద్యార్థి వద్ద భారీ మొత్తంలో నగదు లభించింది. ఆ డబ్బుపై ఉన్న మరకలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా అవి మానవ రక్తపు మరకలుగా నిర్ధారణ కావడంతో కేసులో కీలక ఆధారం లభించింది. అనంతరం విచారణలో విద్యార్థులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

55
ప్రిన్సిపల్‌పై పగ.. డబ్బు కోసం హత్యకు ప్లాన్
Image Credit : Asianet News

ప్రిన్సిపల్‌పై పగ.. డబ్బు కోసం హత్యకు ప్లాన్

నిందితుల్లో ఒకరికి గతంలో రూపారెడ్డితో విభేదాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విద్యార్థి హాస్టల్‌లో ఉన్న సమయంలో అతడి బ్యాగులో డబ్బు, సెల్‌ఫోన్‌ లభించడంతో రూపారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు అతడిని తల్లిదండ్రుల సమక్షంలో మందలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని డేస్కాలర్‌గా మార్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో విద్యార్థి ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అదే సమయంలో అతడికి ఖరీదైన వస్తువులు, బైక్‌లు, ఆల్కహాల్ వంటి వాటిపై ఆసక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో గోవాకు కూడా వెళ్లినట్లు గుర్తించారు. డబ్బు అవసరం కావడంతో రూపారెడ్డి ఇంట్లో నగదు ఉంటుందని భావించి మరో విద్యార్థితో కలిసి చోరీకి పథకం వేసినట్లు చెప్పారు.

ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థిని రూపారెడ్డి గుర్తించడంతో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో ఆమెపై కత్తితో దాడి చేశాడని, మొత్తం 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు ఇంట్లోని నగదును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి వద్ద నుంచి సుమారు లక్షన్నర రూపాయల నగదుతో పాటు రూపారెడ్డి మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ ఇంట్లోకి విద్యార్థులు వెళ్లి ఇంతటి దారుణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్లు డిమాండ్ చేస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
Recommended image2
Now Playing
Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
Recommended image3
Now Playing
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
Related Stories
Recommended image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Recommended image2
Human Eye: మ‌నిషి క‌న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్‌తో స‌మాన‌మో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved