MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • రూ. 1070 కోట్లతో, వెయ్యి ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి.. హైద‌రాబాదీల‌కు వ‌రం

రూ. 1070 కోట్లతో, వెయ్యి ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి.. హైద‌రాబాదీల‌కు వ‌రం

Sanathnagar TIMS: హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగు పడింది. సనత్‌నగర్‌–ఎర్రగడ్డ ప్రాంతంలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) అందుబాటులోకి వ‌చ్చింది.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 18 2026, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
22.6 ఎకరాల్లో భారీ నిర్మాణం.. రూ.1,070 కోట్లకు పైగా వ్యయం
Image Credit : Office of Minister for Health, Telangana/X

22.6 ఎకరాల్లో భారీ నిర్మాణం.. రూ.1,070 కోట్లకు పైగా వ్యయం

సనత్‌నగర్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో టిమ్స్‌ను నిర్మించారు. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లైన నిర్మాణ ప‌నులు ప్ర‌స్తుతం పూర్త‌యి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1,070 కోట్లకు పైగా ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం నిర్మాణ వైశాల్యం దాదాపు 11.68 లక్షల చదరపు అడుగులు. ఒకే మాస్టర్ ప్లాన్ కింద ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు 2022 ఏప్రిల్‌లో పరిపాలనా అనుమతులు లభించగా, అదే నెలలో శంకుస్థాపన జరిగింది. 2023 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) డిజైన్-బిల్డ్ విధానంలో నిర్మాణాన్ని చేపట్టింది.

ఆసుపత్రిలో మొత్తం 1,082 పడకలు ఉన్నాయి. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 అత్యవసర పడకలు, 30 డయాలసిస్ పడకలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా మరో 264 పడకలను కేటాయించారు. ప్రారంభ దశలో 582 పడకలతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన సామర్థ్యాన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
37 విభాగాలు.. గుండె నుంచి అవయవ మార్పిడి వరకు
Image Credit : Hi Kollapur/X

37 విభాగాలు.. గుండె నుంచి అవయవ మార్పిడి వరకు

టిమ్స్ సనత్‌నగర్‌ను సాధారణ ఆసుపత్రిగా కాకుండా కీలక వైద్య రంగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. మొత్తం 37 వైద్య విభాగాల్లో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రామా కేర్ వంటి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

గుండె సంబంధిత సంక్లిష్ట వ్యాధులకు అధునాతన చికిత్సలు, శస్త్రచికిత్సలు చేసే సదుపాయాలు ఉన్నాయి. కిడ్నీ, కాలేయం, గుండె వంటి అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో రోగికి చికిత్స అందించేందుకు 24 గంటల ట్రామా కేర్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఆసుపత్రిలో 3 టెస్లా ఎంఆర్‌ఐ, 128 స్లైస్ సీటీ స్కాన్, అధునాతన మమ్మోగ్రఫీ, క్యాత్ ల్యాబ్స్, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ థియేటర్లు, ప్రత్యేక ఐసీయూలు ఏర్పాటు చేశారు. రోబోటిక్ సర్జరీ సామర్థ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా మౌలిక వసతులను సిద్ధం చేశారు.

Related Articles

Related image1
ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయ భూములున్న ప్రాంతంలో.. ఇప్పుడు ఆకాశన్నంటే నిర్మాణాలు
Related image2
Hyderabad: హైద‌రాబాద్‌లో అమ‌ల్లోకి ట్రాఫిక్ ఆంక్ష‌లు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు
35
ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్.. నిమిషాల్లో నమూనాల రవాణా
Image Credit : Hi Kollapur/X

ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్.. నిమిషాల్లో నమూనాల రవాణా

టిమ్స్ సనత్‌నగర్‌లోని అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా రక్త నమూనాలు, మందులు, వైద్య రిపోర్టులు, ఇతర అవసరమైన వస్తువులను ప్రత్యేక ట్యూబ్‌ల ద్వారా ఆసుపత్రిలోని వివిధ విభాగాల మధ్య వేగంగా తరలించవచ్చు. గాలి ఒత్తిడితో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా నమూనాలను సాధారణంగా ఒకటి నుంచి రెండు నిమిషాల్లో సంబంధిత విభాగానికి చేరవేయవచ్చు.

దీంతో ల్యాబ్‌లు, వార్డులు, ఫార్మసీ మధ్య నమూనాల రవాణాకు పట్టే సమయం తగ్గుతుంది. ముఖ్యంగా అత్యవసర చికిత్సల్లో పరీక్షల ఫలితాలు త్వరగా అందడం ద్వారా వైద్యులు నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. రోగుల తరలింపును సులభతరం చేసేందుకు ప్రత్యేక లిఫ్టులు, రవాణా మార్గాలు కూడా రూపొందించారు. నర్స్ కాలింగ్ సిస్టమ్, అధునాతన పేషెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, డయాగ్నస్టిక్ సేవలు ఆసుపత్రి కార్యకలాపాల్లో కీలకంగా పనిచేయనున్నాయి.

45
పేదలకు ఉచిత వైద్యం.. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు
Image Credit : Hi Kollapur/X

పేదలకు ఉచిత వైద్యం.. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు

టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన లక్ష్యం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి తీసుకురావడం. అర్హులైన పేద రోగులకు వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న రోగుల ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధునాతన చికిత్స అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. పేయింగ్ రోగుల కోసం కూడా నిర్దిష్ట సంఖ్యలో పడకలను కేటాయించే ప్రణాళిక ఉంది. ఈ విభాగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం ఆసుపత్రి ప్రాంగణంలోనే జీ+5 అంతస్తుల ధర్మశాల నిర్మించారు. ఇందులో ఒకేసారి సుమారు 200 మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, సెంట్రల్ కిచెన్, లాండ్రీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

55
రోజుకు 4 వేల మందికి సేవలు..
Image Credit : Hi Kollapur/X

రోజుకు 4 వేల మందికి సేవలు..

టిమ్స్‌లో భవిష్యత్‌లో రోజుకు సుమారు 4 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే స్థాయిలో వ్యవస్థను రూపొందించారు. 2026 మే నుంచి ఓపీ ట్రయల్ రన్ నిర్వహించగా, రోజుకు వందలాది మంది రోగులు వైద్య సేవలు పొందారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు విస్తరించిన తర్వాత రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రభుత్వం వేలాది పోస్టులను మంజూరు చేసింది. వైద్యులు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిని దశలవారీగా నియమిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితోపాటు కొత్త సిబ్బందిని కూడా సేవల్లోకి తీసుకుంటున్నారు. నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సాంకేతికత, వర్షపు నీటి సేకరణ, మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. నీటి వినియోగంలో సుమారు 75 శాతం వరకు ఆదా చేసే విధానాలను అమలు చేసినందుకు ఆసుపత్రికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Recommended image2
Now Playing
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
Recommended image3
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Related Stories
Recommended image1
ఒక‌ప్పుడు వ్య‌వ‌సాయ భూములున్న ప్రాంతంలో.. ఇప్పుడు ఆకాశన్నంటే నిర్మాణాలు
Recommended image2
Hyderabad: హైద‌రాబాద్‌లో అమ‌ల్లోకి ట్రాఫిక్ ఆంక్ష‌లు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved