MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?

Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?

Kavitha: వ‌ధువు మెడ‌లో తాళిబొట్టు ఎవ‌రు క‌డ‌తారు.? అదేం ప్ర‌శ్న.. వ‌రుడే అని అంటారు క‌దూ! అయితే తాజాగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఓ వివాహ వేడుక‌లో వినూత్న ఆచారాన్ని పాటించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 26 2026, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కార్య‌క‌ర్త కోరిక మేర‌కు
Image Credit : Kalvakuntla Kavitha Office/X

కార్య‌క‌ర్త కోరిక మేర‌కు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ పార్టీ నేత వివాహ వేడుకలో ప్రత్యేకంగా కనిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్‌కు సీతాఫల్‌మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్లి బుధవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పరిధిలోని ఈసీఐఎల్‌-కీసర క్రాస్‌రోడ్డులో ఉన్న ఆరాధ్య కన్వెన్షన్‌లో జరిగింది. బాలప్రసాద్‌కు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో తన పెళ్లిలో ఇంటి ఆడబిడ్డగా వ్యవహరించాలని ఆయన కవితను కోరినట్లు తెలిపారు. పార్టీ నేతగా తనతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కవిత ఆ అభ్యర్థనకు అంగీకరించారు. దీంతో వివాహ వేడుకలో ఆమె కుటుంబ సభ్యురాలి హోదాలో సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముదిరాజ్‌ ఆచారం ప్రకారం మూడు ముళ్లు
Image Credit : Kalvakuntla Kavitha Office/X

ముదిరాజ్‌ ఆచారం ప్రకారం మూడు ముళ్లు

బాలప్రసాద్‌ ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందినవారు. ఆ సంప్రదాయం ప్రకారం వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టడానికి ముందు ఆడపడుచు పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేయడం వివాహ వేడుకలో ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ కవిత ముందుగా గౌరీ పూజలో పాల్గొన్నారు. అనంతరం వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత వివాహ కార్యక్రమంలోని ఇతర సంప్రదాయాల్లోనూ ఆమె పాల్గొన్నారు.

Related Articles

Related image1
నెమ్మ‌దిగా వెళ్తేనే త్వ‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచ‌న‌ను మార్చేసే క‌థ
Related image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
34
వధువుకు ఉంగరం తొడిగి.. ఒడిబియ్యం పోసి
Image Credit : Kalvakuntla Kavitha Office/X

వధువుకు ఉంగరం తొడిగి.. ఒడిబియ్యం పోసి

మూడు ముళ్లు వేసిన అనంతరం కవిత వధువు శివానికి ఉంగరం తొడిగారు. అనంతరం ఒడిబియ్యం పోసి ఆమెను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తెకు కుటుంబంలోని పెద్దగా అండగా నిలుస్తూ వివాహ వేడుకలో తన పాత్రను కొనసాగించారు. కవిత సంప్రదాయబద్ధంగా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు సంతోషం వ్య‌క్తంచేశారు. రాజకీయ కార్యక్రమాలకు భిన్నంగా ఓ కుటుంబ వేడుకలో ఆమె ఆడబిడ్డగా వ్యవహరించడం అక్కడి వారికి ఆత్మీయ అనుభూతిని కలిగించింది.

ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత గారు

ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత గారు

తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు.… pic.twitter.com/0hEsqsczQv

— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) August 26, 2026

44
అనంతరం మంగళసూత్రం కట్టిన వరుడు
Image Credit : Kalvakuntla Kavitha Office/X

అనంతరం మంగళసూత్రం కట్టిన వరుడు

కవిత నిర్వహించాల్సిన సంప్రదాయ కార్యక్రమాలు పూర్తైన తర్వాత వరుడు బాలప్రసాద్‌ వధువు శివాని మెడలో మంగళసూత్రం కట్టారు. దీంతో వివాహ తంతు పూర్తయింది. పెళ్లి సందర్భంగా కవిత చూపిన ఆత్మీయతకు బాలప్రసాద్‌ కుటుంబ సభ్యులు సంతోషించారు. బాలప్రసాద్‌ తల్లిదండ్రులు స్వరూప, బాలకృష్ణ, సోదరుడు నాగరాజు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ వేడుకలో ఆమెను ఇంటి ఆడబిడ్డగా భావించి సంప్రదాయ బాధ్యతను స్వీకరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
కల్వకుంట్ల కవిత

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
నెమ్మ‌దిగా వెళ్తేనే త్వ‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచ‌న‌ను మార్చేసే క‌థ
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved