MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 26 2026, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?
Image Credit : chatgpt

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?

భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కొన్ని జిల్లాలకు బిగ్ అలర్ట్
Image Credit : Gemini

తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కొన్ని జిల్లాలకు బిగ్ అలర్ట్

తెలంగాణ వాతావరణం విషయానికొస్తే, రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం సాధారణ ఎండ లేదా తేలికపాటి మేఘాలు ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 30°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 22°C నుండి 24°C మధ్య ఉంటాయి. పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు చెదురుమదురుగా మాత్రమే కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ రోజు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

అయితే, రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Related Articles

Related image1
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Related image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
35
హైదరాబాద్‌లో సీన్ ఏంటి?
Image Credit : Getty

హైదరాబాద్‌లో సీన్ ఏంటి?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 31°C వరకు చేరుకునే అవకాశముండగా, రాత్రి పూట 24°Cకి పడిపోతాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆకాశం మేఘావృతమై, అప్పుడప్పుడు తేలికపాటి చినుకులు లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని అధికారులు తెలిపారు.

45
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: కోస్తా, రాయలసీమ పరిస్థితి ఇదే
Image Credit : Getty

ఆంధ్రప్రదేశ్ వాతావరణం: కోస్తా, రాయలసీమ పరిస్థితి ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా అప్పుడప్పుడు చినుకుల వాన పడుతూ ఉంటుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పొడి వాతావరణం నెలకొంటుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32°C నుండి 35°C వరకు చేరి, కాస్త వేడి పెరిగిన ఫీల్ ఇస్తాయి.

ఆగస్టు 26 నుండి 29 మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.

55
బంగాళాఖాతం అల్లకల్లోలం
Image Credit : Getty

బంగాళాఖాతం అల్లకల్లోలం

ప్రస్తుతం అల్పపీడనం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఏపీ వరకు విస్తరించి పశ్చిమ దిశగా కదులుతోంది. అటు పసిఫిక్ మహాసముద్రంలో 'సాడెల్' తీవ్ర తుపాను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో చైనా వైపు దూసుకెళ్తోంది. దానితో పాటు లాలా, ఇసెల్లే తుపాన్లు, మరో 7 అల్పపీడనాలు పసిఫిక్‌లో కొనసాగుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో సముద్ర జలాలు వేడిగా ఉండడం వల్ల ఏపీ, తెలంగాణకు వెంటనే అత్యంత భారీ వర్ష సూచన లేదు. కానీ, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో అల్లకల్లోలంగా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Recommended image2
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image3
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Related Stories
Recommended image1
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Recommended image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved