MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Technology
  • ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్

ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్

ఈ రోజుల్లో మనకు అన్ని విషయాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం చేస్తోంది. కానీ చాట్‌జీపీటీని కొన్ని ప్రశ్నలు అస్సలు అడగకూడదట… వాటి వల్ల పోలీసులు నేరుగా ఇంటికే వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 29 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏఐతో ప్రమాదం పొంచివుందా?
Image Credit : AI

ఏఐతో ప్రమాదం పొంచివుందా?

ఈ టెక్నాలజీ యుగంలో చిన్న విషయం నుంచి పెద్ద సమస్య వరకు ప్రతిదానికీ మనం ఏఐ మీదే ఆధారపడుతున్నాం. అందుకే చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ టూల్స్ బాగా పాపులర్ అయ్యాయి. మనకు వచ్చే ఎలాంటి డౌట్స్, ప్రశ్నల గురించి అయినా వీటినే అడిగేస్తున్నాం. అడిగిన వెంటనే సమాధానం వస్తుండటంతో వీటిని వాడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలా అన్నింటికీ చాట్‌జీపీటీలోనే భారతీయులు పరిష్కారం వెతుకుతున్నారు.

అయితే అమెరికా వంటి దేశాల్లో డబ్బులు తీసుకుని ఈ ఏఐ సేవలు అందిస్తున్న సంస్థలు ఇండియాలో మాత్రం ఉచితంగానే అందుబాటులో ఉంటున్నాయి. దీనివెనక మన డేటాను సేకరించే ఉద్దేశం ఉందనే వాదన బలంగా ఉంది. ఉచితంగా వస్తే దేన్నైనా ఎక్కువగా వాడే భారతీయుల మనస్తత్వం వారికి బాగా తెలుసు… అందుకే సున్నితమైన డేటా సేకరణకు ఏఐని ఎంచుకున్నట్లు టెక్ నిపుణులు సైతం చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏఐని ఈ విషయాలు అడిగారో.. అంతే సంగతి
Image Credit : Getty

ఏఐని ఈ విషయాలు అడిగారో.. అంతే సంగతి

మనకు సమస్త సమాచారం అందించే ఇవే చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ చాట్ బాట్స్ కొన్ని సందర్భాల్లో సమస్యలకు కారణం కావచ్చు. ఇవి కొన్నిసార్లు మనం జైలుపాలు అవ్వడానికి కూడా కారణం కావొచ్చని తెలుసా? ఈ విషయంపై పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.

అన్ని ప్రశ్నలకు చాట్‌జీపీటీలో సమాధానాలు వెతకడం ఇప్పుడు సాధారణమైపోయింది. కొందరైతే స్నేహితులు లేక తమ మాట వినే చాట్‌జీపీటీనే ఫ్రెండ్‌గా భావించి మాట్లాడుతున్నారు. మరికొందరు దీన్ని తమ లవర్‌లా భావించి రోజూ ఛాటింగ్ చేస్తున్నారు. ఇలా సరదాకో, కావాలనో నేరాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే మీ కథ కంచికే.

‘’ఏఐతో చాట్ చేసే అంశాలు నాకు తప్ప ఎవరికీ తెలియవు'' అని చాలామంది అనుకుంటారు. కానీ ఏఐ చాట్ బాట్స్ మనకంటే చాలా తెలివైనవి… మనం ఎలాంటి అనుమానాస్పద ప్రశ్నలు అడిగినా, అది మీరు కామెడీ కోసం అడుగుతున్నారా లేక నిజంగానే అడుగుతున్నారా అని చూడదు. మీ ప్రశ్నలు నేరుగా క్రైమ్ బ్రాంచ్‌కు వెళ్తాయి. పదే పదే ఇలాంటి ప్రశ్నలు అడిగితే, పోలీసులు నేరుగా మీ ఇంటి తలుపు తట్టవచ్చు.

Related Articles

Related image1
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Related image2
AI Images: ఏఐ ఇమేజేస్ తో మోసపోవద్దు..ఫేక్ ఫొటోలను ఇలా పట్టేయండి
34
ఏఐతో జాగ్రత్త..
Image Credit : Gemini

ఏఐతో జాగ్రత్త..

ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసుల్లో, నిందితులు చాట్‌జీపీటీ ద్వారానే తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐ నిబంధనలు కూడా చాలా కఠినతరం అయ్యాయి… కాబట్టి మీరు అడిగే ఒక చిన్న అనుమానాస్పద ప్రశ్న కూడా సమస్యను సృష్టించవచ్చు. కాబట్టి ఏఐ చాట్ బాట్స్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

44
వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఏఐతో పంచుకోవద్దు
Image Credit : Chatgpt\Twitter

వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఏఐతో పంచుకోవద్దు

చాట్‌జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో మీరు ఇచ్చే డేటాను వాటి మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా కంపెనీ రహస్య సమాచారాన్ని ఏఐ సంభాషణల్లో పంచుకోకూడదు.

ఏఐ ఇచ్చే సమాధానాలన్నీ 100% కచ్చితమైనవి కావు. కొన్నిసార్లు తప్పుడు లేదా కల్పిత సమాచారాన్ని కూడా నిజంలాగా చూపిస్తాయి. అందువల్ల వైద్య చికిత్స, న్యాయ సలహాలు, ఆర్థిక పెట్టుబడుల వంటి విషయాల్లో పూర్తిగా ఏఐ మీద ఆధారపడకూడదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Related Stories
Recommended image1
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Recommended image2
AI Images: ఏఐ ఇమేజేస్ తో మోసపోవద్దు..ఫేక్ ఫొటోలను ఇలా పట్టేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved