MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Technology
  • AI Images: ఏఐ ఇమేజేస్ తో మోసపోవద్దు..ఫేక్ ఫొటోలను ఇలా పట్టేయండి

AI Images: ఏఐ ఇమేజేస్ తో మోసపోవద్దు..ఫేక్ ఫొటోలను ఇలా పట్టేయండి

AI Images: AI వచ్చేశాక సోషల్ మీడియాలో ఏఐ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజుకో ట్రెండ్ నడుస్తోంది. చూడ్డానికి నిజమైనా ఫొటోల్లానే కనిపిస్తున్నాయి. మరి అవి ఒరిజినలా..ఏఐ ఫొటోలా అని ఎలా గుర్తించాలో తెలుసా? ఈ సింపుల్ టిప్‍తో తేడాను కనిపెట్టొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 14 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
AI ఫొటోలను గుర్తించడం ఎందుకు అవసరం?
Image Credit : gemini ai

AI ఫొటోలను గుర్తించడం ఎందుకు అవసరం?

AI వచ్చేశాక సోషల్ మీడియాలో ఏఐ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజుకో ట్రెండ్ నడుస్తోంది. చూడ్డానికి నిజమైనా ఫొటోల్లానే కనిపిస్తున్నాయి. మరి అవి ఒరిజినలా..ఏఐ ఫొటోలా అని ఎలా గుర్తించాలో తెలుసా? ఈ సింపుల్ టిప్‍తో తేడాను కనిపెట్టొచ్చు. ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సృష్టించిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇవి చూడటానికి అచ్చం నిజమైన ఫొటోల్లాగే ఉంటాయి. కానీ, చాలాసార్లు వీటిని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికే వాడుతున్నారు. 2023లో, చాలా దేశాల్లో రాజకీయ నాయకుల నకిలీ AI ఫొటోలు వ్యాపించి, పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, నిజానిజాలు తెలుసుకోవడానికి, వదంతుల్లో చిక్కుకోకుండా ఉండటానికి AI ఫొటోలను గుర్తించడం చాలా అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విచిత్రమైన చేతి వేళ్లు: ఒక ముఖ్యమైన ఆధారం
Image Credit : Chatgpt

విచిత్రమైన చేతి వేళ్లు: ఒక ముఖ్యమైన ఆధారం

AI ఫొటోలను గుర్తించడానికి ఈజీ మార్గం…ఆ ఫొటోల్లోని మనుషుల చేతి వేళ్లను జాగ్రత్తగా గమనించడం. AI టూల్స్ ఇప్పటికీ మనుషుల చేతులను కరెక్ట్‌గా సృష్టించడంలో ఇబ్బంది పడుతున్నాయి. చాలాసార్లు ఒక చేతికి ఐదు వేళ్లకు బదులుగా ఆరు లేదా నాలుగు వేళ్లు ఉంటాయి. వేళ్ల ఆకారం కూడా వింతగా, వంగిపోయినట్లు లేదా ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు కనిపిస్తుంది. గోళ్లు కూడా విచిత్రమైన ఆకారంలో ఉండొచ్చు. ఈ చిన్న లోపాలను గమనిస్తే, అది AI ఫొటోనా కాదా అని వెంటనే చెప్పేయొచ్చు.

Related Articles

Related image1
Railways: ఛీ.. ట్రైన్‍లో ఇదేం పాడు పని...దుప్పట్లు కూడా సరిపోవట్లేదుగా
Related image2
Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
35
బ్యాక్‌గ్రౌండ్, వస్తువులు: గందరగోళంగా ఉండే దృశ్యం
Image Credit : Chatgpt

బ్యాక్‌గ్రౌండ్, వస్తువులు: గందరగోళంగా ఉండే దృశ్యం

AI ఫొటోలను గుర్తించడానికి మరో ముఖ్యమైన సూచన, వాటి బ్యాక్‌గ్రౌండ్, దగ్గర్లోని వస్తువులను పరిశీలించడం. AI టూల్స్ మనుషుల ముఖాలను బాగానే సృష్టిస్తున్నా, బ్యాక్‌గ్రౌండ్‌ విషయంలో తడబడతాయి. బిల్డింగుల గీతలు వంకరగా, కిటికీలు అస్తవ్యస్తంగా ఉండొచ్చు. చెట్లు, మొక్కలు విచిత్రంగా కనిపిస్తాయి. గుంపుగా ఉన్న ఫొటోల్లో అయితే, వెనకాల ఉన్న ముఖాలు మసకగా, ఉంటాయి. ఫొటోలోని అక్షరాలు అస్పష్టంగా, అర్థం లేకుండా ఉంటే, అది AI ఫొటో అయ్యే అవకాశం ఎక్కువ.

45
పొంతన లేని వివరాలు
Image Credit : Chatgpt

పొంతన లేని వివరాలు

నిజమైన ఫొటోలలో కాంతి, నీడ, ప్రతిబింబాలు ఒక లాజిక్‌ను పాటిస్తాయి. కానీ, AI ఫొటోలు ఈ విషయంలో తడబడతాయి. ఫొటోలోని వేర్వేరు వస్తువులపై పడే కాంతి దిశలో తేడాలు కనిపిస్తాయి. వస్తువుల నీడలు సరిగ్గా ఉండవు లేదా అసలే ఉండకపోవచ్చు. నీరు, అద్దం వంటి మెరిసే ఉపరితలాలపై ప్రతిబింబాలు కరెక్ట్‌గా ఉండవు. ఉదాహరణకు, మనుషుల కళ్లలో ప్రతిబింబాలు లేకపోవడం లేదా వింతగా కనిపించడం సాధారణం. ఈ చిన్న చిన్న తప్పులు కూడా AI ఫొటోలను గుర్తించడంలో సహాయపడతాయి.

55
నిజ నిర్ధారణకు ఉచిత టూల్స్
Image Credit : Chatgpt

నిజ నిర్ధారణకు ఉచిత టూల్స్

AI ఫొటోలను గుర్తించడానికి ఇంటర్నెట్‌లో కొన్ని ఉచిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి. 'హైవ్ ఏఐ డిటెక్టర్' (Hive AI Detector) వెబ్‌సైట్లు ఒక ఫొటో AIతో సృష్టించారా లేదా అని విశ్లేషించి చెబుతాయి. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ (Google Reverse Image Search) ద్వారా, ఒక ఫొటో మొదట ఎక్కడ పోస్ట్ అయిందో కనుక్కొని, దాని మూలాన్ని చెక్ చేయవచ్చు. ఒక ఫొటోను చూసినప్పుడు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పోస్ట్ చేశారని చూసుకోవాలి. నమ్మకమైన వార్తా సంస్థలు, వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మండి. ఏదైనా ఫొటోపై అనుమానం వస్తే, దాన్ని షేర్ చేయకుండా ఉండటమే మేలు. అప్రమత్తంగా ఉండండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
మీ పాత కంప్యూట‌ర్‌ను కొత్త‌గా మార్చే జియోపీసీ.. అస‌లేంటిది.? ఎలా ప‌నిచేస్తుంది.?
Recommended image3
ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్
Related Stories
Recommended image1
Railways: ఛీ.. ట్రైన్‍లో ఇదేం పాడు పని...దుప్పట్లు కూడా సరిపోవట్లేదుగా
Recommended image2
Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved