- Home
- Life
- Chopping Board: కూరగాయలు కట్ చేయడానికి ఏ చాపింగ్ బోర్డు వాడుతున్నారు? స్టీల్, వుడ్ రెండిటిలో ఏది బెస్ట్?
Chopping Board: కూరగాయలు కట్ చేయడానికి ఏ చాపింగ్ బోర్డు వాడుతున్నారు? స్టీల్, వుడ్ రెండిటిలో ఏది బెస్ట్?
Chopping Board: కూరగాయలు కట్ చేయడానికి చాపింగ్ బోర్డు వాడుతున్నారా? ప్లాస్టిక్ వాడటం మంచిది కాదని మనకు తెలుసు. మరి చెక్క, స్టీల్ వాడే చాపింగ్ బోర్డు వాడొచ్చా? ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

చాపింగ్ బోర్డ్..
కిచెన్ లో కూరగాయలు కట్ చేయడానికి మనం వాడే చాపింగ్ బోర్డు కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు.. అది మన ఆరోగ్యాన్ని, వంట గది పరిశుభ్రతను ప్రభావితం చేస్తుంది. మరి, మనకు మార్కెట్లో లభించే చాపింగ్ బోర్డ్స్ లో ప్లాస్టిక్, చెక్క, స్టీల్ చాపింగ్ బోర్డులలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి? దేని వల్ల నష్టాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...
వుడెన్ చాపింగ్ బోర్డ్..
చెక్కతో చేసిన చాపింగ్ బోర్డును పూర్వ కాలం నుంచి వాడుతూనే ఉన్నాం. ఈ చెక్కదానిపై మనం కూరగాయలు కట్ చేయడం వల్ల.. కత్తుల పదును తగ్గదు. షార్ప్ గానే ఉంటాయి. ఇక, దీనిని తయారు చేయడానికి ఎక్కువగా.. వేప, లేదా బాంబూ (వెదురు)తో చేసిన బోర్డులలో సహజ సిద్ధమైన యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను లోపలికి పీల్చుకుని నాశనం చేస్తాయి.
సమస్యలు: వీటిని కడిగిన తర్వాత సరిగ్గా ఆరబెట్టకపోతే బూజు పట్టే అవకాశం ఉంది. డిష్‌వాషర్‌లో వేయకూడదు. ఎప్పటికప్పుడు కొబ్బరి నూనె లేదా మినరల్ ఆయిల్ అప్లై చేస్తూ నిర్వహించాలి.
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్:
తక్కువ ధరకు లభించడం, శుభ్రం చేయడం సులభం కావడం వల్ల చాలా ఇళ్లలో ప్లాస్టిక్ బోర్డులే కనిపిస్తాయి.
ఉపయోగాలు: తేలికగా ఉంటాయి, డిష్‌వాషర్‌లో కడగవచ్చు, రకరకాల రంగుల్లో లభిస్తాయి. (ఉదాహరణకు: చికెన్‌కి ఒకటి, కూరగాయలకు మరొకటి వాడవచ్చు).
సమస్యలు: కత్తితో కోసేటప్పుడు ప్లాస్టిక్ బోర్డుపై పడే గాట్లు లోపల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇటీవలి పరిశోధనల ప్రకారం కత్తి గాట్ల వల్ల చిన్న చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు మనం కోసే కూరగాయలలో కలసి కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది.
3. స్టీల్ చాపింగ్ బోర్డ్:
ఈమధ్య కాలంలో స్టీల్ బోర్డులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి చూడటానికి మోడరన్‌గా ఉంటాయి.
ఉపయోగాలు: శుభ్రం చేయడం చాలా తేలిక, నీటిని పీల్చుకోవు, బూజు పట్టే ప్రసక్తే ఉండదు. బ్యాక్టీరియా అస్సలు నిలవదు.
సమస్యలు: స్టీల్ బోర్డులు చాలా గట్టిగా ఉంటాయి. వీటిపై కత్తితో కోస్తున్నప్పుడు వచ్చే శబ్దం (Noise) కొందరికి చికాకు కలిగిస్తుంది. అలాగే, లోహంపై లోహం పడటం వల్ల కత్తుల పదును చాలా వేగంగా తగ్గిపోతుంది.
ఏది వాడటం ఉత్తమం?
వంటగదిలో వుడ్ (చెక్క/వెదురు) చాపింగ్ బోర్డు వాడటమే అత్యంత సురక్షితం, ఉత్తమం.
శాకాహారానికి (కూరగాయలు, పండ్లు): మంచి క్వాలిటీ ఉన్న చెక్క లేదా వెదురు (Bamboo) బోర్డు వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మాంసాహారానికి (చికెన్, మటన్, చేపలు): ప్లాస్టిక్ లేదా స్టీల్ బోర్డును ఉపయోగించవచ్చు. ఎందుకంటే నీటితో లేదా వేడి నీటితో సులభంగా క్రిమిసంహారక (Sanitize) చేయవచ్చు.
చిన్న సలహా: మీరు చెక్క బోర్డు వాడుతున్నట్లయితే, కడిగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టడం మాత్రం మర్చిపోకండి!
