పీరియడ్స్ టైంలో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది. దీన్ని నివారించడానికి, కడుపు ఉబ్బరం తగ్గించుకోవడానికి నీళ్లు బాగా తాగాలి.
నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే అసౌకర్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.
పీరియడ్స్ టైంలో ఐరన్ లెవెల్స్ పడిపోవడం సహజం. దీన్ని అధిగమించడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
పీరియడ్స్ టైంలో అల్లం టీ తాగితే వికారం, ఇతర ఇబ్బందులు తగ్గుతాయి. కానీ, ఎక్కువ తాగితే కడుపునొప్పి, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది.
డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం పీఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పీరియడ్స్ టైంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం ముఖ్యం. నూనెశాతం ఎక్కువగా ఉండే చేపలు తినడం వల్ల నొప్పి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి