MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Watching Reels: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

Watching Reels: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

Watching Reels: మనలో చాలామందికి రీల్స్ చూసే అలవాటు ఉంటుంది. నిజానికి రీల్స్ చూస్తుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కానీ ఇలా ఎక్కువసేపు స్క్రోలింగ్ చేస్తే మన మెదడులో ఏం జరుగుతుందో, నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 25 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గంటల తరబడి రీల్స్ చూస్తే ఏమవుతుంది?
Image Credit : AI

గంటల తరబడి రీల్స్ చూస్తే ఏమవుతుంది?

ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటివి మన సమయాన్ని తినేస్తున్నాయి. సరదాగా రీల్స్ స్క్రోల్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ ఇది మన మెదడు నిర్మాణం, భావోద్వేగాలపై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి గంటలతరబడి రీల్స్ చూడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సాధారణ పనులపై ఆసక్తి తగ్గిపోవడం
Image Credit : Getty

సాధారణ పనులపై ఆసక్తి తగ్గిపోవడం

రీల్స్ చూస్తున్నప్పుడు మన మెదడులో 'డోపమైన్' అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది మెదడులోని 'రివార్డ్ సిస్టమ్'ను యాక్టివేట్ చేస్తుంది. ప్రతిసారి స్క్రీన్ పైకి జరిపినప్పుడు, 'తర్వాతి రీల్‌లో ఏముందో' అనే ఆసక్తి పెరుగుతుంది. 15-30 సెకన్లలోనే వినోదం దొరకడంతో, మెదడుకు వెంటనే డోపమైన్ అందుతుంది. ఇలా పదేపదే డోపమైన్ విడుదల కావడం వల్ల, మెదడు ఈ వేగవంతమైన ఆనందానికి బానిస అవుతుంది. దీంతో పుస్తకాలు చదవడం, పని చేయడం వంటి సాధారణ పనులపై ఆసక్తి తగ్గిపోతుంది.

Related Articles

Related image1
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Related image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
36
భావోద్వేగాల గందరగోళం
Image Credit : pinterest

భావోద్వేగాల గందరగోళం

రీల్స్‌లో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటిలోని భావోద్వేగాల వేగవంతమైన మార్పు. ఒక రీల్‌లో బాధ, మరో రీల్‌లో నవ్వు, ఇంకో రీల్‌లో కోపం.. ఇలా క్షణాల్లో ఎమోషన్స్ మారిపోతాయి. ఒక భావోద్వేగాన్ని ప్రాసెస్ చేయడానికి మెదడుకు కొంత సమయం కావాలి. కానీ రీల్స్ వల్ల ఆ టైమ్ దొరకదు. దీంతో ఎమోషన్స్ అన్నీ మెదడులో గందరగోళం సృష్టిస్తాయి. కంప్యూటర్‌లో వందల ట్యాబ్‌లు ఓపెన్ చేస్తే ఎలా స్లో అవుతుందో, అలాగే మన మెదడు కూడా ‘బ్రెయిన్ ఫాగ్’ అనే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు సరిగ్గా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.

46
ఏకాగ్రత లోపం
Image Credit : Getty

ఏకాగ్రత లోపం

షార్ట్ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వేగంగా మారే దృశ్యాలకు అలవాటుపడిన మెదడుకు, పుస్తకం చదవడం లేదా ఎక్కువసేపు మాటలు వినడం వంటివి బోర్ కొడతాయి. మెదడు ముందు భాగంలో ఉండే ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ ప్లానింగ్, నిర్ణయాలు తీసుకోవడం, స్వీయ నియంత్రణను కంట్రోల్ చేస్తుంది. రీల్స్ చూడటం.. దీని పనితీరును తగ్గిస్తుంది. అంతేకాదు, షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టైం మెమరీగా మార్చడానికి మెదడుకు కావాల్సిన సమయం దొరకదు. అందుకే చూసిన విషయాలు గుర్తుండవు.

56
బయటపడటం ఎలా?
Image Credit : Getty

బయటపడటం ఎలా?

ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. రోజూ కొంత సమయం అంటే ఉదయం లేవగానే గంట, రాత్రి పడుకునే ముందు గంట మొబైల్ వాడకుండా ఉండాలి. అలాగే సోషల్ మీడియా యాప్స్‌లో 'యాప్ టైమర్' సెట్ చేసుకొని, రీల్స్ చూసే సమయాన్ని రోజుకు 20-30 నిమిషాలకు పరిమితం చేయాలి. వ్యాయామం, యోగా, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం వంటి పనులతో మెదడుకు ఆరోగ్యకరమైన డోపమైన్‌ను అందించాలి.

66
మానసిక ఒత్తిడి మాయం
Image Credit : Getty

మానసిక ఒత్తిడి మాయం

స్క్రీన్‌పై వేగంగా కదిలే ప్రతి రీల్ మన ప్రశాంతతను, ఏకాగ్రతను, భావోద్వేగ సమతుల్యతను కొద్దికొద్దిగా దెబ్బతీస్తుంది. వినోదం కోసం వాడే ఈ డిజిటల్ మాధ్యమాలను పరిమితికి లోబడి వాడటమే మన మానసిక ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహిళలు నలభై దాటాక తిండి తగ్గించినా కూడా బరువు తగ్గడం కష్టమే
Recommended image2
Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!
Recommended image3
Parenting: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? పేరెంట్స్ మార్చుకోవాల్సిన 5 అలవాట్లు ఇవే
Related Stories
Recommended image1
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved