Telugu

Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా

Telugu

రంగు రంగు బొట్టు బిళ్లలతో..

ఇంట్లో ఉండే రంగురంగుల బొట్టు బిళ్లలతో అద్భుతమైన రాఖీ చేయొచ్చు. ఓ చిన్న గుండ్రటి కార్డ్‌బోర్డ్ ముక్కను తీసుకోండి. దాని చుట్టూ  రంగుల బొట్లను అతికించండి. అంతే, సింపుల్ రాఖీ రెడీ.

Image credits: INSTAGRAM
Telugu

కలర్ స్టోన్స్‌తో ఫ్యాన్సీ లుక్

ఫ్యాన్సీ రాఖీ కోసం రంగురంగుల స్టోన్స్, ముత్యాలు వాడండి. ఒక దళసరి కాగితం లేదా కార్డ్‌బోర్డ్‌ను గుండ్రంగా కట్ చేసుకోండి. దాని మధ్యలో ఒక ముత్యం, చుట్టూ కలర్ స్టోన్స్ అతికిస్తే సరి.

Image credits: INSTAGRAM
Telugu

తెల్ల రాళ్లతో మరింత మెరుపు

రాఖీ ఏ రంగులో ఉన్నా సరే, దానిపై తెల్లటి స్టోన్స్ వాడితే డిజైన్ మరింత హైలైట్‌గా కనిపిస్తుంది. రంగు బేస్‌పై తెల్లటి స్టోన్స్ బోర్డర్ ఇవ్వడం లేదా మధ్యలో అలంకరిస్తే ప్రీమియం లుక్ పక్కా

Image credits: INSTAGRAM
Telugu

ముత్యాలతో సింపుల్ & క్యూట్ రాఖీ

తెల్లటి ముత్యాలతో చేసిన రాఖీ చూడటానికి చాలా బాగుంటుంది. ఎరుపు లేదా మీకు నచ్చిన రంగు దారంలోకి ముత్యాలు ఎక్కించండి. మధ్యలో అలంకరించిన భాగాన్ని గట్టిగా అతికిస్తే చాలు.

Image credits: INSTAGRAM
Telugu

హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాఖీ

రాఖీ ఇంకా అందంగా కావాలంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాఖీ బెస్ట్ ఆప్షన్. ఒక చిన్న గుండ్రటి బేస్‌కు రంగుల వస్త్రాన్ని చుట్టి, దానిపై మీరు ముందుగా తయారు చేసుకున్న ఎంబ్రాయిడరీని అతికించవచ్చు

Image credits: INSTAGRAM

Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి

Blouse Designs: మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!

Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్