Beauty Tips: మీ ముఖం కాంతివంతగా మెరువాలా.. అయితే టమాటాతో ఇలా చేయండి?
Beauty Tips: టమాటాని కూరల్లోకి, చెట్నీల్లోకి, నిలవ పచ్చడిలో గాను పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ టమాటా అందాన్ని మెరుగుపరుచుకోవటానికి కూడా పనికి వస్తుంది. ఆ చిట్కాలు ఏంటో ఏం చేస్తే మన అందం రెట్టింపు అవుతుందో ఇక్కడ చూద్దాం.

మనం ఎలాంటి కూర చేసుకున్నా ఒక్క టమాటా పండు వేస్తే చాలు రుచి మొత్తం మారిపోతుంది. పిలవ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కోరలేదని బెంగ అక్కర్లేదు. కూరల్లో టమాటా కి ఉన్న స్థానం అలాంటిది అయితే ఆ టమాటా రుచిలోనే కాదు సౌందర్య సాధనాల్లో సైతం నేనున్నాను అంటుంది.
టమాటా టాన్ తొలగించడం నుంచి చర్మానికి ఉన్న అదనపు నూనె మరియు మొటిమలతో పోరాటం వరకు అన్ని సమస్యలని పరిష్కరించగలదు. అలాగే చర్మాన్ని వివిధ మార్చడంలో కూడా సహాయపడుతుంది. మీ చర్మం జిడ్డుగా అనిపించినప్పుడు పచ్చి టమాటాలను చర్మం అంతా..
రుద్ది అయిదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయండి ఇది జిడ్డుని తగ్గించడంతోపాటు అధిక జిడ్డు రాకుండా సహాయపడుతుంది. టమాటా సహజంగా రక్తస్రావ నివారణగా పనిచేస్తుంది.
కాబట్టి ఓపెన్ రంధ్రాలు మరియు బ్లాక్ హెడ్స్ ని తగ్గించడానికి దీనిని ఉపయోగించవచ్చు. టమాటాలు ఆస్ట్రింజెంట్ గా పనిచేయడంతో పాటు చర్మం యొక్క నిస్తేజాన్ని మేలుకొలపటానికి సహాయపడుతుంది.
అలాగే టమాటా లోని ప్రకాశవంతం చేసే గుణాలు మీకు సన్ టాన్ ని తొలగించి టోన్ మరియు ప్రకాశంవంతమైన ఛాయను అందించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై మరియు మెడపై పట్టించండి.
15 నుండి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వలన చర్మం మీద ఉండే టాన్ తగ్గడమే కాకుండా.. సూర్యుని యొక్క బలమైన యూ వి కిరణాల వల్ల కలిగే పొడిని కూడా తగ్గిస్తుంది. టమాటా చర్మానికి ఫ్రెష్ మరియు ఫెయిర్ లుక్ ని ఇవ్వడంలో ముందుంటుంది.