MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Drumstick Soup: వేడి వేడి మునక్కాడల సూప్ తాగితే.. వానాకాలంలో అదిరిపోతుంది

Drumstick Soup: వేడి వేడి మునక్కాడల సూప్ తాగితే.. వానాకాలంలో అదిరిపోతుంది

Drumstick Soup: మునగకాడలతో వేడివేడిగా, రుచికరమైన సూప్ చేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఘుమఘుమలాడే మునగకాడ సూప్ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. చల్లని వాతావరణంలో ఇది రుచిగా ఉంటుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 23 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మునగకాడ సూప్ ఎలా చేయాలి?
Image Credit : pinterest

మునగకాడ సూప్ ఎలా చేయాలి?

మునగకాడ అనగానే మనకు సాంబార్ గుర్తొకొస్తుంది. నిజానికి మునక్కాడలతో రకరకాల వంటలు వండుకోవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి మునగకాడ సూప్ ట్రై చేయండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఘాటుకు మునగకాడ రుచి తోడైతే ప్రతి స్పూన్ ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తాగేందుకు ఈ సూప్ అదిరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మునక్కాడల సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : pinterest

మునక్కాడల సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మునగకాడలు - 2

చిన్న ఉల్లిపాయలు - 6 నుంచి 8

టమాటా - 1 (చిన్నది)

వెల్లుల్లి - 4 రెబ్బలు

మిరియాలు - 1 టీస్పూన్

జీలకర్ర - 1/2 టీస్పూన్

పసుపు - 1/4 టీస్పూన్

వెన్న లేదా నూనె - 1 టీస్పూన్

నీళ్లు - 3 నుంచి 4 కప్పులు

ఉప్పు - తగినంత

కొత్తిమీర - కొద్దిగా

33
మునగకాడ సూప్ రెసిపీ
Image Credit : pinterest

మునగకాడ సూప్ రెసిపీ

  1. మునక్కాడల సూప్ చేసేందుకు మునగకాడలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో మునగకాడ ముక్కలు, కొద్దిగా పసుపు, నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
  2. మునగకాడ ముక్కలు చల్లారాకల లోపల ఉన్న గుజ్జును స్పూన్‌తో తీసి పక్కన పెట్టుకోవాలి. మునగకాడలు ఉడికించిన నీళ్లను పారబోయకుండా సూప్ కోసం ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఉడికించిన మునగకాడ గుజ్జులో కొద్దిగా ఉడికించిన నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. సూప్ మరింత స్మూత్‌గా కావాలనుకుంటే దీన్ని వడకట్టుకోవచ్చు.
  4. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
  5. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఆపై కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తబడేదాకా మగ్గనివ్వాలి.
  6. ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మునగకాడ గుజ్జు, మిగిలిన ఉడికించిన నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి మీడియం మంట మీద 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేస్తే, ఘుమఘుమలాడే మునగకాడ సూప్ రెడీ.
  7. స్పైసీగా కావాలనుకునేవారు మిరియాల పొడిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సూప్ క్రీమీగా ఉండాలనుకుంటే కొద్దిగా పాలు లేదా కొబ్బరి పాలు కలుపుకోవచ్చు. అయితే పాలు పోశాక ఎక్కువసేపు మరిగించకుండా వెంటనే దించేయడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Miracle Drink: ఉదయానే ఖాళీ పొట్టతో ఈ నీళ్లు తాగండి చాలు.. ఆ సమస్యలేవీ రావు
Recommended image2
Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?
Recommended image3
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Related Stories
Recommended image1
Indian River: మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది?
Recommended image2
Miracle Drink: ఉదయానే ఖాళీ పొట్టతో ఈ నీళ్లు తాగండి చాలు.. ఆ సమస్యలేవీ రావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved