MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Miracle Drink: ఉదయానే ఖాళీ పొట్టతో ఈ నీళ్లు తాగండి చాలు.. ఆ సమస్యలేవీ రావు

Miracle Drink: ఉదయానే ఖాళీ పొట్టతో ఈ నీళ్లు తాగండి చాలు.. ఆ సమస్యలేవీ రావు

Miracle Drink: రోజు ఉదయం లేచిన వెంటనే ఖాళీ పొట్టతో మనం తీసుకునే ఆహారం శరీరంలో భారీ ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రతిరోజూ జీలకర్ర నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 23 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిరాకిల్ డ్రింక్.. జీలకర్ర నీళ్లు
Image Credit : Getty

మిరాకిల్ డ్రింక్.. జీలకర్ర నీళ్లు

మన ప్రతి ఇంట్లో జీలకర్ర ఉంటుంది. కూరల్లో, తాళింపుల్లో జీలకర్ర పడితేనే రుచి. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇది కూరలకు రుచి, వాసన ఇస్తాయి. అయితే జీలకర్ర నీటికి కూడా ఎంతో మంచి ప్రాధాన్యం ఉంది. దీనిలో మంచి పోషకాలు నిండి ఉన్నాయి. మరిగించి తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన లాభాలు అందుతాయి.

జీలకర్ర తినడం వల్ల మన శరీరంలో జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును పెరుగుతుంది. ఇది కొవ్వు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను సులభంగా కరిగించేస్తుంది. ఈ నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, పేగుల పనితీరు చురుగ్గా మారుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలను ఇది ఇట్టే తగ్గిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కొవ్వు కరుగుతుంది
Image Credit : Getty

కొవ్వు కరుగుతుంది

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీలకర్ర నీళ్లు ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల మన శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగించేందుకు ఇవి సాయపడతాయి. రోజూ తీసుకునే ఆహారంతో పాటు జీలకర్ర నీళ్లు తాగుతూ, చిన్నపాటి వ్యాయామం చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది. భోజనం తర్వాత షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా ఈ నీరు అడ్డుకుంటుంది. పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల స్వీట్లు తినాలనే కోరిక తగ్గడంతో పాటు, రోజంతా నీరసం రాకుండా ఉంటుంది.

33
మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది
Image Credit : Getty

మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది

మన శరీర కణాలు వృద్ధాప్యానికి కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని జీలకర్ర తగ్గిస్తుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ సూచికలను మెరుగుపరుస్తుంది. మన శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియనుఇది వేగవంతం చేస్తుంది.

జీలకర్ర నీళ్లలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఐరన్, డైటరీ ఫైబర్ ఇందులో అధికంగా ఉంటాయి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే రోజూ జీలకర్ర నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది విషపదార్థాలను బయటకు పంపి, చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జీలకర్రలో మెండుగా ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pattu Pavadai Dress: ఈ లెటెస్ట్ పట్టు పరికిణీల్లో మీ బుజ్జి పాపాయిలు ప్రిన్సెస్ లుక్ లో అదిరిపోతారు
Recommended image2
Gold Bangles: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజుల డిజైన్లు
Recommended image3
Kitchen Gadgets: రూ.100 లోపు దొరికే బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్.. వీటితో మీ పనులు చాలా ఈజీ!
Related Stories
Recommended image1
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Recommended image2
Indian River: మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved