నీర్ దోశను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. బియ్యాన్ని రుబ్బే ముందు కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది.
Image credits: Instagram
Telugu
సన్న బియ్యం వాడండి
నీర్ దోశ చాలా సాఫ్ట్‌గా రావాలంటే సోనా మసూరి లేదా ఇతర సన్న బియ్యాన్ని వాడటం మంచిది. లావు బియ్యంతో దోశలు అంత మెత్తగా రావు.
Image credits: Instagram
Telugu
పిండి పల్చగా ఉండాలి
పిండి పాలు లాగా పల్చగా, ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే జల్లెడ లాంటి నీర్ దోశలు వేయడం అస్సలు కుదరదు.
Image credits: Instagram@youreverydaycook
Telugu
పెనం మీద పిండిని రుద్దకండి
మామూలు దోశల్లాగా గరిటెతో పిండిని పెనం మీద రుద్దకండి. దోశ పెనం మీద గుండ్రంగా పిండిని పోస్తే చాలు, అది దానంతట అదే పల్చగా విస్తరిస్తుంది.
Image credits: Instagram@youreverydaycook
Telugu
మూతపెట్టి ఉడికించండి
పెనం మీద పిండి పోసిన వెంటనే దోశపై మూత పెట్టండి. ఆ ఆవిరికే దోశ చక్కగా ఉడికిపోయి, మెత్తగా వస్తుంది.