MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?

షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?

పంచదార కూడా జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.మీ షాంపూలో రెండే రెండు చెంచాల పంచదార కలిపి వాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ చిన్న చిట్కా మీ జుట్టుకు ఇచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 06 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
షాంపూలో పంచదార కలిపితే
Image Credit : Box of Tricks YT

షాంపూలో పంచదార కలిపితే

పంచదారను వంటకాలకే వాడతారు. నిజానికి దీంతో జుట్టును కూడా బలంగా మార్చుకోవచ్చు. ఇది ఒక మంచి 'ఎక్స్‌ఫోలియెంట్‌'గా (Exfoliant) కూడా పనిచేస్తుంది. అంటే చర్మంపై ఉన్న మృతకణాలు, మురికిని సున్నితంగా తొలగిస్తుంది. షాంపూతో కలిపినప్పుడు, ఇది తల మాడు (Scalp) ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు మెరిసేలా చేస్తుంది.

ఈ మిశ్రమం తల మాడుపై ఉన్న మృతకణాలను (Dead cells) తొలగిస్తుంది. పేరుకుపోయిన జిడ్డును (Oil) కంట్రోల్ చేస్తుంది. హెయిర్ స్ప్రే, జెల్ వంటి వాటి అవశేషాలను లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా జుట్టు చాలా శుభ్రంగా, మెరుస్తూ (Shiny) కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా వాడాలి?
Image Credit : Getty

ఎలా వాడాలి?

పంచదారను నేరుగా షాంపూ బాటిల్‌లో వేయొద్దు. వాడేటప్పుడు మాత్రమే కలపాలి. అరచేతిలో షాంపూ తీసుకుని, ఒకటి లేదా రెండు చెంచాల పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించి, వేలికొనలతో నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయండి. గోళ్లతో గట్టిగా రుద్దొద్దు. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయండి. చివరగా కండిషనర్ వాడండి.

Related Articles

Related image1
Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ వంటకాలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Related image2
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
33
ఎన్నిసార్లు వాడాలి?
Image Credit : Getty

ఎన్నిసార్లు వాడాలి?

ఇది ఒకరకమైన స్క్రబ్బింగ్ కాబట్టి రోజూ చేయకూడదు. మీది జిడ్డు జుట్టు (Oily Hair) అయితే వారానికి ఒకసారి చాలు. పొడి జుట్టు లేదా సున్నితమైన తల మాడు (Dry/Sensitive Scalp) ఉన్నవాళ్లు 15 రోజులకు లేదా నెలకు ఒకసారి వాడితే సరిపోతుంది.

చుండ్రు (Dandruff) ఎక్కువగా ఉన్నా, జుట్టు బాగా రాలుతున్నా, లేదా తలపై గాయాలు/మంట ఉన్నా ఈ చిట్కా పాటించవద్దు. ఇలాంటి సమస్యలుంటే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించడం మంచిది. ఇది కేవలం ఒక ఇంటి చిట్కా మాత్రమే, వైద్య చికిత్స కాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
Recommended image2
Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ వంటకాలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ వంటకాలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved