MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డయాబెటీస్ పేషెంట్లకు ఈ కూరగాయలు చాలా మంచివి

డయాబెటీస్ పేషెంట్లకు ఈ కూరగాయలు చాలా మంచివి

డయాబెటీస్ అని నిర్దారణ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీళ్లు రోజూ వ్యాయామం చేస్తూ, టైంకు నిద్ర పోవాలి. అలాగే మందులు వాడాలి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2022, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే  చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. 
 

29
diabetes

diabetes

మీకు డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే.. కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే టైం ప్రకారం నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. మందులు వాడాలి. మానస్థితిని మెరుగుపర్చుకోవడం వంటి విషయాలపై జాగ్రత్త వహించాలి. అయితే మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిరూపించబడింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో తెలుసుకుందాం పందండి.

39

సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను తక్కువుగా, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. 

49

బ్రోకలి

బ్రోకలి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రోకలీలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

59

బచ్చలికూర

బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమినన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బచ్చలికూరలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న బచ్చలికూర మధుమేహ వ్యాధిగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

69

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవు. దీనిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. బొప్పాయిని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలొస్తాయి. 
 

79

టమాటాలు

టమాటాలు లేని కూర చేయడం దాదాపుగా అసాధ్యమే. టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) 30 నే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి ఉత్తమమైన ఆహారంగా చెప్పొచ్చు. టమోటాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

89

క్యారెట్లు

క్యారెట్లను తింటే ఆరోగ్యంగా ఉండటమే కాదు.. శరీరం కూడా ప్రకాశవంతంగా తయారవుతుంది. క్యారెట్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 39 గా ఉంటుంది. దీనిలో ఫైబర్, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండే క్యారెట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే ఉత్తమ కూరగాయ.

99

బీట్ రూట్

బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఈ కూరగాయలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మధుమేహులు తినగలిగిన హెల్తీ ఫుడ్. బీట్ రూట్ లో విటమిన్ సి, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహులు ఎంచక్కా వీటిని రోజూ తినొచ్చు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spider web in the house: ఇంట్లో సాలీడు గూడు కట్టడం శుభమా? అశుభమా?
Recommended image2
Pregnancy Age: గర్భం దాల్చడానికి సరైన వయసెంత? ఈ ఏజ్ దాటితే రిస్క్ అంటున్న నిపుణులు
Recommended image3
Earrings: 2 గ్రాముల్లో ఆఫీసుకు వెళ్లే మహిళలకు డైలీవేర్ ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved