MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!

Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!

Vastu Tips: ఇల్లు, ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం. నిపుణుల ప్రకారం మనం పడుకునే మంచం కింద పెట్టే కొన్ని వస్తువులు జీవితంలో చాలా సమస్యలకు కారణమవుతాయట. మరి మంచం కింద ఏ వస్తువులను పెట్టకూడదో తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 20 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మంచం కింద పెట్టకూడని వస్తువులు
Image Credit : AI Image

మంచం కింద పెట్టకూడని వస్తువులు

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పడుకునే మంచం కేవలం విశ్రాంతి తీసుకునే ఫర్నిచర్ మాత్రమే కాదు, అది మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కూడా. మంచం చుట్టూ ఉండే వాతావరణం మన ఆరోగ్యం, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది స్థలం లేక మంచం కింద వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం కింద పెట్టడం వల్ల తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలు పడతాయి. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎలక్ట్రానిక్ వస్తువులు
Image Credit : Gemini

ఎలక్ట్రానిక్ వస్తువులు

మంచం కింద మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వైర్లు, పాత బ్యాటరీలు, పవర్ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం కింద ఇలాంటి వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పనిచేయని లేదా ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద నిల్వ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, పాత బ్యాటరీలు లేదా దెబ్బతిన్న ఛార్జర్లు మంచం కింద ఉంచడం భద్రత పరంగా కూడా మంచిది కాదు.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Related image2
Telugu Saying: రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొంగలపాలు.. పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
37
పాత న్యూస్ పేపర్లు
Image Credit : our own

పాత న్యూస్ పేపర్లు

చాలామంది ఇంట్లో స్థలం సరిపోకపోవడం లేదా వెంటనే అవసరం లేదనే కారణంతో పాత న్యూస్‌పేపర్లు, పనికిరాని రశీదులు, పాత బిల్లులు, కాగితాలు, మ్యాగజైన్లు వంటి వాటిని మంచం కింద కుప్పగా పోస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి అనవసరమైన కాగితాలను నిల్వ చేయడం మంచిది కాదు. మంచం అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి, దాని చుట్టూ శుభ్రత, క్రమబద్ధత ఉండటం ముఖ్యమని వాస్తు నమ్మకం.

47
పాత బట్టలు
Image Credit : Getty

పాత బట్టలు

మంచం కింద పాత, చిరిగిన లేదా ఉపయోగించని బట్టలు దాచే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వాస్తు ప్రకారం ఇలాంటి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, వాతావరణాన్ని భారంగా మారుస్తాయని నమ్మకం. ఇవి మనశ్శాంతిని తగ్గించడంతో పాటు, జీవితంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

57
పదునైన వస్తువులు
Image Credit : Getty

పదునైన వస్తువులు

కత్తెర, చాకు, సూది లేదా పిన్నుల వంటి పదునైన వస్తువులను పొరపాటున కూడా మంచం కింద పెట్టొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది ఇంట్లో తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు, వాగ్వాదాలు మొదలవడానికి కారణం కావచ్చు.
67
మందులు
Image Credit : pexels

మందులు

రాత్రిపూట అవసరం వస్తుందని చాలామంది మందులను మంచం కింద పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. మందులు మంచం కింద ఉంచడం ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని పెంచి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. దీనివల్ల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

77
పాజిటివ్ ఎనర్జీ కోసం..
Image Credit : Gemini AI

పాజిటివ్ ఎనర్జీ కోసం..

వాస్తు నిపుణుల ప్రకారం.. మంచం కింద ఎలాంటి అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. మంచం కింద ప్రదేశం ఎంత ఖాళీగా, శుభ్రంగా ఉంటే, పాజిటివ్ ఎనర్జీ అంత సులభంగా చుట్టూ ప్రసరిస్తుంది. ఇది మీకు ప్రశాంతమైన నిద్రను, జీవితంలో విజయాన్ని అందిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image2
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Recommended image3
Passport: ప్రపంచంలో ఏ దేశానికీ ‘ పింక్ కలర్ పాస్ పోర్టు’ మాత్రం ఎందుకు ఉండదు..? అసలు కారణం ఇదే..!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Recommended image2
Telugu Saying: రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొంగలపాలు.. పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved