MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తెగ తినేస్తున్నారా? ఈ సమస్యలు వచ్చేస్తాయి జాగ్రత్త

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తెగ తినేస్తున్నారా? ఈ సమస్యలు వచ్చేస్తాయి జాగ్రత్త

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌ అంటే ఎంతో మందికి ఇష్టం. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే దీన్ని అతిగా తింటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 20 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డ్రాగన్ ఫ్రూట్ తో జాగ్రత్త
Image Credit : Getty

డ్రాగన్ ఫ్రూట్ తో జాగ్రత్త

డ్రాగన్ ఫ్రూట్‌ పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. ఈ పడులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి కోసమే ఎంతో మంది డ్రాగన్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఇది ఎన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. కానీ ఇదే పండును అతిగా తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

డ్రాగన్ ఫ్రూట్ కొంతమందికి అలర్జీని ఇస్తుంది. అలాంటివాళ్లు దీన్ని పూర్తిగా తినకపోవడమే మంచిది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది, కానీ ఈ పండు తిన్న తర్వాత దురద, చర్మంపై దద్దుర్లు, పెదాలు లేదా నాలుక వాపు, వాంతులు వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తే ఈ పండుకు దూరంగా ఉండడమే మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డయాబెటిస్ ఉన్నవారు?
Image Credit : pinterest

డయాబెటిస్ ఉన్నవారు?

డ్రాగన్ ఫ్రూట్ తిన్నతరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు డ్రాగన్ ఫ్రూట్ తినే పరిమాణంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తిన్న తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా, డయాబెటిస్ తగ్గించే మందులు లేదా ఇన్సులిన్ వాడేవాళ్లు దీన్ని ఎక్కువగా తింటే, రక్తంలో చక్కెర స్థాయులు బాగా పడిపోయే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Related image2
మన పూజ గదిలో కనిపించే దేవుళ్లకు ఆ రూపాన్ని ఇచ్చినది ఎవరో తెలుసా?
33
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు
Image Credit : Getty

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలోని పొటాషియం స్థాయులను నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే, పండ్లలోని పొటాషియం పరిమాణం చాలా ముఖ్యం. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు డ్రాగన్ ఫ్రూట్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ వ్యాధి దశ, రక్తంలో పొటాషియం స్థాయి, వాడుతున్న మందుల ఆధారంగా ఎంత పరిమాణంలో తినాలో డాక్టరే నిర్ణయించాలి.

ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది సాధారణంగా సురక్షితమైన పండు. కానీ, అలర్జీలు ఉన్నవాళ్లు దీన్ని పూర్తిగా తినకూడదు. డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, దీన్ని ఎంత మోతాదులో తినవచ్చో డాక్టర్‌తో మాట్లాడి తెలుసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Agarbatti: ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలు ఇవే!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Recommended image3
Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
Related Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image2
మన పూజ గదిలో కనిపించే దేవుళ్లకు ఆ రూపాన్ని ఇచ్చినది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved